యువతి వేధింపుల కేసులో టీవీస్టార్ అరెస్ట్

TV Actor Abhinav Kohli Arrested For Sexually Harassing Woman

యువతి వేధింపుల కేసులో టీవీస్టార్ అభినవ్‌ను అరెస్ట్ చేసినట్టు ముంబై పోలీసులు తెలిపారు. సహానటి, మోడల్‌ అయిన ఓ యువతిని లైంగికంగా వేధించడంతో పాటు.. ఆమెపై చెయ్యి చేసుకున్న కేసులో టీవీ నటుడు అభినవ్‌ కొహ్లీని అరెస్ట్ చేసినట్టు పోలీసులు చెప్పారు.

తన తల్లితో కలిసి పోలీస్‌ స్టేషకి వచ్చి ఫిర్యాదు చేశారని.. విచారణ జరిపిన అనంతరం అభినవ్‌ను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. తనను దారుణంగా తిట్టడంతో పాటు, అసభ్యకరంగా ఉన్న మోడల్స్ ఫొటోలను తనకు చూపించి.. కోరిక తీర్చాలని వేధించారని సదరు నటి ఫిర్యాదు చేశారు. ఈ మధ్య మరీ వేధింపులు ఎక్కువ అవడంతో.. భరించలేకనే ఫిర్యాదు చేస్తున్నానని నటి పేర్కొంది. కాగా.. అభినవ్‌పై ఐపీసీ 354-ఏ, 323, 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారమన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *