దేశానికి తెలంగాణ దిక్సూచిగా నిలుస్తుంది.. రాష్ట్రాలకు కేంద్రం మరింత చేయూతనివ్వాలన్న గుత్తా సుఖేందర్‌రెడ్డి

భారత 72 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ శాసన మండలి ప్రాంగణంలో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ..

దేశానికి తెలంగాణ దిక్సూచిగా నిలుస్తుంది.. రాష్ట్రాలకు కేంద్రం మరింత చేయూతనివ్వాలన్న గుత్తా సుఖేందర్‌రెడ్డి
Follow us

|

Updated on: Jan 26, 2021 | 1:21 PM

భారత 72 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ శాసన మండలి ప్రాంగణంలో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారితో కలిసి గణతంత్ర దినోత్సవంలో పాల్గొన్నారు.

72 సంవత్సరాల గణతంత్ర దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని గుత్తా సుఖేందర్‌రెడ్డి చెప్పారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఈ రాష్ట్రం గణనీయమైన ప్రగతిని సాదించిందని వివరించారు. దేశం ఇంకా అభివృద్ధి సాధించాలంటే రాష్ట్రాలకు మరింత చేయూతనివ్వాలని కోరారు.

తెలంగాణ పోలీసులు శాంతి భద్రతల్లో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నారు..వారికి ప్రత్యేకంగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నానని గుత్తా అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం సహాకరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, చీఫ్‌విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, విప్‌లు భాను ప్రకాష్, ఎమ్మెస్‌ ప్రభాకర్, ఎమ్మెల్సీలు జనార్దన్ రెడ్డి, భూపాల్ రెడ్డి, తేర చిన్నపరెడ్డి, అసెంబ్లీ సెక్రెటరీ డా” నర్సింహా చార్యులు, టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యదర్శి రమేష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.