బాబోయ్..ఎలుకల WWE ఫైట్‌ ఎప్పుడైనా చూశారా..? ఆ భయంకరమైన వీడియో చూశారంటే..

సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతిరోజూ అనేక విచిత్రమైన, ఆసక్తికరమైన వీడియోలు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా జంతువులు, పక్షులకు సంబంధించిన వీడియోలకు నెటిజన్ల నుండి విశేష ఆదరణ లభిస్తుంది. తాజాగా లండన్ అండర్‌గ్రౌండ్ రైల్వే స్టేషన్‌లో రెండు ఎలుకలు ఆహారం కోసం మనుషుల్లా కొట్లాడుకున్న దృశ్యం ఇంటర్నెట్‌లో తెగ హల్‌చల్ చేస్తోంది. ఈ ఎలుకల ఫైట్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా తెగ నవ్విస్తోంది.

బాబోయ్..ఎలుకల WWE ఫైట్‌ ఎప్పుడైనా చూశారా..? ఆ భయంకరమైన వీడియో చూశారంటే..
London Underground Rat Fight

Updated on: Sep 04, 2026 | 12:43 PM

సోషల్ మీడియా ప్రపంచంలో మనం ఏం చూస్తామో ఊహించలేము. కొన్నిసార్లు మనుషుల వీధి పోరాటాల వీడియోలు వైరల్ అవుతాయి. మరికొన్నిసార్లు జంతువులవి. కానీ ఈసారి, మిమ్మల్ని నివ్వెరపరిచే ఒక వీడియో ఆన్‌లైన్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ఈ సంఘటన లండన్‌లోని రద్దీగా ఉండే మెట్రో స్టేషన్‌లో జరిగింది. అక్కడ రెండు ఎలుకలు ఒకదానికొకటి తన్నుకుంటూ, గుద్దుకుంటూ కనిపించాయి. అసలేం జరిగింది?

లండన్‌లోని ప్రసిద్ధ ఆక్స్‌ఫర్డ్ సర్కస్ అండర్‌గ్రౌండ్ స్టేషన్‌లో అర్ధరాత్రి ప్రయాణికుల రద్దీ తక్కువగా ఉన్న సమయంలో ఈ విచిత్ర సంఘటన జరిగింది. ప్లాట్‌ఫామ్‌పై పడి ఉన్న ఒక చిన్న ఆహార పదార్థం కోసం రెండు ఎలుకలు పోటీపడ్డాయి. ఆ ఆహారాన్ని దక్కించుకోవడానికి అవి రెండూ ప్రాణపణంగా పోరాటం ప్రారంభించాయి. ఒకదానికొకటి కాళ్లతో తోసుకుంటూ, గాలిలోకి ఎగురుతూ, మనుషులు డబ్ల్యూడబ్ల్యూఈ లేదా బాక్సింగ్ రింగ్‌లో కొట్లాడుకున్నట్లే ఆ ఎలుకలు సేమ్ టు సేమ్ విన్యాసాలు చేశాయి.

ప్లాట్‌ఫామ్‌పై రైలు కోసం వేచి చూస్తున్న ఒక ప్రయాణికుడు ఈ ఆసక్తికరమైన దృశ్యాన్ని తన స్మార్ట్‌ఫోన్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. లండన్ సబ్‌వే స్టేషన్లలో ఎలుకల మధ్య జరిగే పోరాటాలు కొత్తేమీ కాదు. కొన్నేళ్ల క్రితం సామ్ రోలీ అనే ఫోటోగ్రాఫర్ లండన్ అండర్‌గ్రౌండ్‌లో రెండు ఎలుకలు ఆహారం కోసం కొట్లాడుకుంటున్న దృశ్యాన్ని ఫొటో తీశాడు. ఆ ఫొటోకు Station Squabble అని పేరు పెట్టగా, దానికి లండన్ సహజ చరిత్ర మ్యూజియం అందించే ప్రసిద్ధ వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో వైరల్ అవ్వగానే నెటిజన్లు రకరకాల సరదా కామెంట్లతో రచ్చ చేస్తున్నారు. ఇది కేవలం ఆహారం కోసం జరిగిన పోరాటం కాదు.. లండన్ ఎలుకల ఛాంపియన్‌షిప్ ఫైట్! అని ఒకరు కామెంట్ చేయగా,
మన జీవితాల్లో ఉద్యోగం, డబ్బు కోసం చేసే పోరాటం కంటే ఈ ఎలుకల పోరాటంలో ఉన్న తీవ్రత ఏమాత్రం తక్కువ కాదు అని మరొకరు చమత్కరించారు.

నగరాల్లో జనసంచారం తగ్గిన తర్వాత ఆధిపత్యం చెలాయించే ఈ చిన్న జీవుల కొట్లాట వీక్షకులకు ఎంతో వినోదాన్ని పంచుతోంది. ప్రస్తుతం ఈ ఎలుకల గొడవకు సంబంధించిన వీడియో అన్ని సోషల్ మీడియా వేదికల్లో ట్రెండింగ్‌లో నిలిచింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us