లంచ్ బ్రేక్‌లో మారిన అదృష్టం.. 20 నిమిషాల్లో రూ. 19 కోట్లు గెలిచిన మహిళ! తర్వాత ఏం చేసిందో తెలుసా?

ఎప్పుడు ఎవరి జాతకం ఎలా మారుతుందో చెప్పడం కష్టం. ఆఫీసు పని ఒత్తిడిలో కాసేపు రీఫ్రెష్ అవుదామని బయటకు వెళ్లిన ఒక మహిళకు, లంచ్ బ్రేక్ సమయంలోనే కోట్లాది రూపాయల జాక్‌పాట్ తగిలింది. కేవలం ఒకే ఒక్క లాటరీ టికెట్ ఆమె జీవితాన్నే మార్చేసింది. అమెరికాలో జరిగిన ఈ ఆసక్తికర సంఘటన ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

లంచ్ బ్రేక్‌లో మారిన అదృష్టం.. 20 నిమిషాల్లో రూ. 19 కోట్లు గెలిచిన మహిళ! తర్వాత ఏం చేసిందో తెలుసా?
Virginia Lottery
Image Credit source: freepik

Updated on: Sep 25, 2026 | 7:03 AM

అదృష్టం ఎప్పుడు, ఏ రూపంలో తలుపు తడుతుందో ఎవరూ ఊహించలేరు. అమెరికాలో ఒక మహిళకు కేవలం 20 నిమిషాల లంచ్ బ్రేక్‌లో లక్కీ లాటరీ తగిలింది. అమెరికాలోని వర్జీనియా రాష్ట్రానికి చెందిన ఒక మహిళ ఆఫీసు పని ఒత్తిడిలో ఉండి, కాసేపు లంచ్ బ్రేక్ తీసుకుంది. బయట ఏదైనా తిని వద్దామని ఆఫీసు నుంచి బయటకు వచ్చింది. మార్గమధ్యలో ఉన్న లవ్ ఫుడ్ మార్ట్ అనే దుకాణానికి వెళ్లింది. అక్కడ సరదాగా తన అదృష్టాన్ని పరీక్షించుకుందామని 20 డాలర్లు వెచ్చించి ప్లాటినమ్ 7s అనే స్క్రాచ్-ఆఫ్ లాటరీ టికెట్‌ను కొనుగోలు చేసింది.

టికెట్ పైభాగాన్ని స్క్రాచ్ చేసి చూసిన ఆ మహిళ ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఆ టికెట్‌కు లాటరీలో మొదటి బహుమతి అయిన 2 మిలియన్ డాలర్లు (భారతీయ కరెన్సీలో సుమారు రూ. 19 కోట్లకు పైగా) వచ్చింది. కేవలం 20 నిమిషాల లంచ్ సమయం ఆమెను రాత్రికి రాత్రే కోటీశ్వరురాలిగా మార్చేసింది.

సాధారణంగా ఎవరికైనా లాటరీలో కోట్లు వస్తే ఆనందంతో కేరింతలు కొడతారు లేదా ఎగిరి గంతేస్తారు. కానీ, ఈ మహిళ ప్రవర్తించిన తీరు వర్జీనియా లాటరీ అధికారులతో పాటు ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచింది. కోట్ల రూపాయల జాక్‌పాట్ గెలుచుకున్న విషయాన్ని ఎవరికీ చెప్పకుండా, లాటరీ టికెట్‌ను జాగ్రత్తగా దాచుకుని నిశ్శబ్దంగా తిరిగి ఆఫీస్‌కు వెళ్లిపోయింది.

ఇవి కూడా చదవండి

మిగతా రోజంతా ఏమీ జరగనట్లే ప్రవర్తిస్తూ, తన పని తాను చేసుకుని షిఫ్ట్ ముగిశాకే ఇంటికి వెళ్లింది. తర్వాత బహుమతి నగదు అందుకునే సమయంలో ఆమె మాట్లాడుతూ..నేను వెంటనే ఆఫీస్‌కు తిరిగి వెళ్లాలి, అక్కడ ఏమీ జరగనట్లే సాధారణంగా ప్రవర్తించాలి అనుకున్నాను అని తెలిపింది.

డబ్బు ఎలా తీసుకుందంటే?

వర్జీనియా చట్టాల ప్రకారం ఆ మహిళ తన పేరు, సమాచారాన్ని గోప్యంగా ఉంచుకోవడానికి నిర్ణయించుకుంది. వర్జీనియా లాటరీ నిబంధనల ప్రకారం విజేతలకు రెండు రకాల ఆప్షన్లు ఉంటాయి. ఒకటి 30 ఏళ్ల పాటు ప్రతి ఏటా కొంత మొత్తంలో 2 మిలియన్ డాలర్లు తీసుకోవడం. రెండు– పన్నులు మినహాయించుకుని ఒకేసారి నగదు రూపంలో తీసుకోవడం. ఆమె రెండో మార్గాన్ని ఎంచుకుని పన్నులు పోను ఒక్కసారిగా $952,000 నగదును పొందింది. అంతేకాకుండా, గెలుపొందిన లాటరీ టికెట్‌ను అమ్మినందుకు సదరు దుకాణానికి కూడా లాటరీ సంస్థ నుంచి బోనస్ లభించింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us