ఎవ్వరైనా కూడా కొత్త ఇంట్లోకి వెళ్లినప్పుడు.. వారి టేస్ట్‌కు అనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తుంటారు. సరిగ్గా ఇలాగే ఓ మహిళ కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసి.. ఆ ఇంటికి కొన్ని మార్పులు చేసింది. అయితే ఆ మార్పులే ఆమెను తలపట్టుకునేలా చేశాయి. సదరు మహిళకు ఓ అజ్ఞాత వ్యక్తి లెటర్ రాశాడు.. ఆ లెటర్ ఆమె ఫ్యుజూలు ఎగిరిపోయేలా చేసింది. అసలు ఇంతకీ అందులో ఏముందో చూసేద్దాం పదండి.!
ఈ ఘటన ఇంగ్లాండ్‌లోని గ్రేటర్ మాంచెస్టర్‌లో జరిగింది. 26 ఏళ్ల సారా యేట్స్ రీసెంట్‌గా ఓ ఇల్లు కొనుక్కుంది. స్టాక్‌పోర్ట్‌లోని ఆమె నివాసానికి కావాల్సిన మార్పులు చేర్పులు చేసుకుంది. అందులో భాగంగానే తన బాత్రూమ్‌ను లావిష్‌గా డిజైన్ చేసుకుని కొత్త లైట్స్ కూడా పెట్టింది. లైట్ ఆన్స్ చేసిన సమయంలో బయటవారు చూడగలరా.? లేదా.? అనేది కూడా సారా నిర్ధారించుకుని.. ఈ మార్పులకు శ్రీకారం చుట్టింది. అయితే ఆమె అనుకున్నది ఒకటి.. జరిగింది మరొకటి.. కొద్దిరోజులకు ఆమె గేట్‌కు ఉన్న పోస్ట్‌బాక్స్‌కు ఓ లెటర్ వచ్చింది. దానిని చదివి ఆమె ఒక్కసారిగా షాక్ అయింది.
ఆ లెటర్ సారంశం ఇది.. ”మీ ఇంటి బాత్రూమ్ కిటికీకి ఏదైనా అడ్డుపెట్టాలి. లేదంటే ప్రతీది కనిపిస్తుంది. మీ తలుపు తట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. అందుకే ఇదంతా” అని పేర్కొంది. వృత్తిరీత్యా జర్నలిస్ట్ అయిన సారా ఇటీవల తన ఇంట్లో కొన్ని మార్పులు చేసినట్లుగా తెలిపింది. ఇటీవల సెలవుల తరువాత గ్రీస్ నుండి తిరిగి వచ్చిన సారాకు.. ఈ లెటర్ షాకిచ్చినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఆ కిటికీ ద్వారా అంతా బయటికి కనిపిస్తుందని తెలియదు. ఆ లేఖ వచ్చిన తర్వాత.. బయటపడింది. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నానని.. 10 రోజుల అనంతరం మరమ్మత్తులు చేపడతానని సారా స్పష్టం చేసింది.
మార్కెట్‌లో దొరికే చేపలు తాజాగా ఉన్నాయో లేదో ఈ సింపుల్ చిట్కాల ద్వారా తెలుసుకోండి!
ఇంటి చుట్టూ తిరిగిన ‘దెయ్యం నీడ’.. పిల్లలే టార్గెటా.? ఒళ్లు గగుర్పొడిచే వీడియో వైరల్..
మీరెప్పుడైనా ‘వెనమ్’ను రియల్‌గా చూశారా.? వేట మాములుగా ఉండదు.. షాకింగ్ వీడియో.!