Viral News: భర్తను ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టిన భార్య.. కారణం తెలిస్తే ఫ్యూజులు ఎగరాల్సిందే.!

Viral News: ఇదేంటి టైటిల్ ఇలా పెట్టారని ఆశ్చర్యపోకండి. మీరు విన్నది నిజమే. ఓ భార్య తన భర్తకు ఉన్న అలవాటుకు విసిగిపోయి.. అతగాడిని..

Viral News: భర్తను ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టిన భార్య.. కారణం తెలిస్తే ఫ్యూజులు ఎగరాల్సిందే.!
Woman

Updated on: Jan 24, 2022 | 8:51 AM

ఇదేంటి టైటిల్ ఇలా పెట్టారని ఆశ్చర్యపోకండి. మీరు విన్నది నిజమే. ఓ భార్య తన భర్తకు ఉన్న అలవాటుకు విసిగిపోయి.. అతగాడిని ఏకంగా ఆన్‌లైన్‌(Online Sale)లో అమ్మకానికి పెట్టేసింది. ఈ ఘటన న్యూజిలాండ్‌(New Zealand)లో చోటు చేసుకోగా.. ఇంతకీ అందుకు గల కారణం ఏంటో తెలుసుకుంటే మీరు కూడా ఖచ్చితంగా షాక్ అవుతారు.

వివరాల్లోకి వెళ్తే.. న్యూజిలాండ్‌కి చెందిన లిండా అనే మహిళ తన భర్త జాన్‌ను ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టింది. దీనికి కారణం లేకపోలేదట. ఆమె భర్తకు వాకింగ్‌ వెళ్లే హాబీ ఉందట. పిల్లల్ని చూసుకోవాలని చెప్పినప్పుడల్లా అతగాడు వాకింగ్‌కు వెళ్ళిపోతుంటాడట. అంతేకాదు ఆమెకేమో భర్తతో గడపటం చాలా ఇష్టం. కానీ భర్త ఏమో ఆమెకు చెప్పాపెట్టకుండా వాకింగ్‌కు వెళ్లిపోయేవాడట. అందుకే భర్త ప్రవర్తనకు విసిగిపోయిన ఆమె ‘హస్బండ్ ఫర్ సేల్’ అంటూ ఆన్‌లైన్‌ ట్రేడింగ్ సైట్‌లో ప్రొఫైల్ క్రియేట్ చేసి ఉంచింది. యూజ్డ్ అనే ట్యాగ్ కూడా పెట్టింది.

ప్రకటన ఇలా ఉంది..

పొడవు 6 అడుగుల 1 అంగుళం, వయస్సు 37 ఏళ్లు, వృత్తి రైతు. అలాగే నిజాయితీపరుడు అంటూ పేర్కొన్న ఆమె.. ఎవరైనా కొనుగోలు చేస్తే షిప్పింగ్ ఉచితం అని ఆఫర్ ఇచ్చింది. కాగా, తన భార్య ఇచ్చిన ఈ ప్రకటనను చూసుకుని జాన్ తెగ నవ్వుకున్నాడట.