వార్నీ.. ఒకే దేశంలో 20 లక్షలకు పైగా సరస్సులా.. ఈ అద్భుతం ఎక్కడ ఉందో తెలిస్తే అవాక్కే..

అటు చూస్తే అంతుచిక్కని నీలిమందు రంగులో మెరిసిపోయే జలాశయాలు.. ఇటు చూస్తే కళ్లు చెదిరే పచ్చని ప్రకృతి. భూమ్మీద ఎక్కడా లేని విధంగా ఒకే దేశంలో ఏకంగా 20 లక్షలకు పైగా సరస్సులు ఉన్నాయంటే మీరు నమ్ముతారా? అసలు ఇన్ని లక్షల సరస్సులు ఒకేచోట ఎలా ఏర్పడ్డాయి? వేల ఏళ్ల క్రితం కరిగిన మంచు కొండల వెనుక దాగిన అద్భుతమైన రహస్యం ఏమిటి? అనేది తెలుసుకుందాం..

వార్నీ.. ఒకే దేశంలో 20 లక్షలకు పైగా సరస్సులా.. ఈ అద్భుతం ఎక్కడ ఉందో తెలిస్తే అవాక్కే..
Country With The Most Lakes

Updated on: Aug 16, 2026 | 2:36 PM

ప్రపంచంలోనే అత్యంత విస్తారమైన, అద్భుతమైన మంచినీటి నిల్వలకు కెనడా పెట్టింది పేరు. భూమ్మీద ఉన్న మొత్తం సరస్సులలో అత్యధిక శాతం కేవలం కెనడాలోనే ఉండటం విశేషం. చిన్నవి, పెద్దవి అనే తేడా లేకుండా దేశవ్యాప్తంగా సుమారు 20 లక్షలకు పైగా సరస్సులు విస్తరించి ఉన్నాయని పర్యావరణ పరిశోధకులు, శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. కేవలం 100 చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువ వైశాల్యం కలిగిన అతిపెద్ద మహా సరస్సులే ఇక్కడ 563కు పైగా ఉన్నాయి. కెనడాలోని ఏ మారుమూల ప్రాంతంలో రోడ్డు ప్రయాణం చేసినా రహదారికి ఇరువైపులా విస్తారమైన జలాశయాలు, కనువిందు చేసే సహజ సరస్సులు నిరంతరం దర్శనమిస్తూనే ఉంటాయి. ఈ అపారమైన జలవనరుల కారణంగానే కెనడా ప్రపంచంలోనే అతిపెద్ద సహజ మంచినీటి భాండాగారంగా గుర్తింపు పొందింది.

వేల ఏళ్ల నాటి మంచు పలకల చరిత్ర

ఈ సరస్సులు అకస్మాత్తుగా ఏర్పడినవి కావు. వీటి వెనుక వేల సంవత్సరాల భౌగోళిక చరిత్ర ఉంది. పూర్వం ఈ ప్రాంతాన్ని కప్పి ఉంచిన భారీ మంచు పలకలు నెమ్మదిగా కరగడం ప్రారంభించాయి. ఆ ఒత్తిడికి భూమిలో ఏర్పడిన భారీ అగాధాలు, లోయలలోకి మంచు నీరు చేరి విస్తారమైన సరస్సుల వ్యవస్థగా రూపాంతరం చెందాయి. కెనడాలోని కఠినమైన రాతి నేలలు ఈ నీటి నిల్వలకు సహజ ఆనకట్టలుగా మారాయి.

ఆర్థిక రంగానికి వెన్నెముక.. ఆదివాసీల జీవన సంస్కృతి

కెనడా, అమెరికా సరిహద్దుల్లో విస్తరించి ఉన్న గ్రేట్ లేక్స్ ప్రపంచంలోనే అత్యంత కీలకమైన మంచినీటి వ్యవస్థలలో ఒకటి. ప్రపంచంలోని అతిపెద్ద మంచినీటి సరస్సులలో ఏడు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. ఈ సరస్సులు కోట్లాది మందికి తాగునీటిని అందించడమే కాకుండా.. వ్యవసాయం, భారీ పరిశ్రమలు, జలవిద్యుత్ ఉత్పత్తి మరియు జలరవాణాకు ప్రాణాధారంగా నిలుస్తున్నాయి. శతాబ్దాలుగా స్థానిక ఆదివాసీ సమాజాలు ఈ సరస్సుల తీరాల్లో జీవిస్తున్నాయి. వారి సంస్కృతి, జీవన విధానం, గుర్తింపు ఈ జలాశయాలతో ముడిపడి ఉన్నాయి.

వాతావరణ మార్పులతో ముప్పు

ప్రస్తుతం గ్లోబల్ వార్మింగ్ ప్రభావం ఈ మంచినీటి నిల్వలపై తీవ్రంగా పడుతుంది. ఉష్ణోగ్రతలు పెరిగి నీరు వేడెక్కడం, నీటిమట్టాలు గణనీయంగా పడిపోవడం, కాలుష్యం, తీరప్రాంత నిర్మాణాల కారణంగా ఈ సరస్సుల సహజ సమతుల్యత దెబ్బతింటుంది. ప్రపంచ పర్యావరణ పరిరక్షణ కోసం ఈ అద్భుతమైన జలవనరులను కాపాడుకోవడం అత్యంత ఆవశ్యకమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us