
ప్రస్తుతం సోషల్ మీడియాలో పర్పుల్ పర్సన్ అనే ట్రెండ్ తెగ వైరల్ అవుతుంది. దీంతో చాలా మందికి అసలు ఈ పర్పుల్ పర్సన్ అంటే ఎవరు..? ఇదేం ట్రెండ్ అనే డౌట్లు వస్తున్నాయి. హూ ఈజ్ యువర్ కలర్ పర్సన్? ఛాలెంజ్ నుండి ఈ పదం పుట్టింది. మనుషుల ఎనర్జీ, వారి వ్యక్తిత్వాన్ని బట్టి వారికి ఒక్కో రంగును ఆపాదిస్తారు. అందులో పర్పుల్‌కు ఒక ప్రత్యేకత ఉంది. చారిత్రకంగా పర్పుల్ రంగును రాయల్టీకి, సృజనాత్మకతకు, ఆధ్యాత్మిక లోతుకు ప్రతీకగా చూస్తారు. సోషల్ మీడియా నిర్వచనం ప్రకారం.. పర్పుల్ పర్సన్ అంటే మీ జీవితంలోకి ఎప్పుడో ఒకప్పుడు ప్రవేశించి, కేవలం తమ ఉనికితోనే మీ జీవితాన్ని మరింత అందంగా మార్చేసిన ఒక అపురూపమైన వ్యక్తి. మీ హృదయం కేవలం వారి కోసమేనేమో అన్నంతగా వారు మీ జీవితంలో కలిసిపోతారు.
ఇన్‌స్టంట్ కనెక్షన్: అంతకుముందు వారితో పెద్దగా పరిచయం లేకపోయినా, కలిసిన తొలి క్షణాల్లోనే ఒక బలమైన బంధం ఏర్పడుతుంది.
స్పూర్తిని రగిలిస్తారు: మీలో దాగున్న సృజనాత్మకతను, సరికొత్త ఆలోచనలను మరెవరూ చేయలేనంతగా వారు బయటకు తీస్తారు.
నిజాయితీని మేల్కొల్పుతారు: వారి పక్కన ఉన్నప్పుడు మీరు ఎలాంటి ముసుగులు వేసుకోనక్కర్లేదు. మీలోని అమాయకమైన, అల్లరి పిల్ల లాంటి అసలైన వ్యక్తిత్వాన్ని బయటపెడతారు.
జడ్జ్ చేయని మనస్తత్వం: మీరు ఎలా ఉన్నా మిమ్మల్ని అర్థం చేసుకుంటారు తప్ప, తప్పుపట్టరు.
శాశ్వత స్థానం: మీ గుండెల్లో వారికి ఎంత ప్రత్యేక స్థానం ఉంటుందంటే.. వారి స్థానాన్ని ఇంకెవరితోనూ భర్తీ చేయలేరు.
ఈ డిజిటల్ కాలంలో మనుషులు పర్పుల్ పర్సన్ బంధం కోసం ఎందుకు ఇంతగా ఆరాటపడుతున్నారనే అంశంపై ఆర్ఎస్ఎస్ సైకాలజిస్ట్ శ్రేయా గుప్తా కొన్ని కీలక విషయాలు పంచుకున్నారు. ‘‘ఇవాల్టి రోజుల్లో చాలా బంధాలు ఒక లావాదేవీలా లేదా పైపై మెరుగులతో సాగుతున్నాయి. అందుకే మనుషులు ఎలాంటి శ్రమ లేకుండా, సహజంగా సాగే నిజమైన బంధాల కోసం తపిస్తున్నారు. పర్పుల్ పర్సన్ ఉన్నచోట మనం నటించాల్సిన అవసరం లేదు, మనలా మనం ఉంటే చాలు అనే మానసిక భద్రత లభిస్తుంది’’ అని శ్రేయా గుప్తా అన్నారు. మనం నిరంతరం సోషల్ మీడియా, డిజిటల్ హడావుడి మధ్య బతుకుతున్నాం. ఇలాంటి సమయంలో మనల్ని మనలా అంగీకరించే వ్యక్తి దొరికితే, వారు మన జీవితానికి ఒక సైకలాజికల్ యాంకర్ లా మారుతారని ఆమె తెలిపారు. సైకాలజీ పరంగా చెప్పాలంటే.. ఎరుపు రంగు ఇచ్చే ప్యాషన్, నీలం రంగు ఇచ్చే ప్రశాంతత.. ఈ రెండింటి కలయికే పర్పుల్. అందుకే ఈ బంధంలో అటు ఎమోషన్, ఇటు పీస్ సమానంగా దొరుకుతాయి.
సైకాలజిస్ట్ శ్రేయా గుప్తా సూచన ప్రకారం.. మీ జీవితంలో ఉన్న ఒక వ్యక్తి గురించి ఈ ప్రశ్నలు వేసుకోండి..
కేవలం అలాంటి వ్యక్తి కోసం వెతకడమే కాదు, మనమే ఒకరికి పర్పుల్ పర్సన్‌గా మారాలని శ్రేయా గుప్తా పిలుపునిచ్చారు.
శ్రద్ధగా వినండి: వారు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో అడ్డుపడకుండా పూర్తిగా వినండి.
వారి వ్యక్తిత్వాన్ని గౌరవించండి: వారు ఎలా ఉన్నారో అలాగే వారిని సెలబ్రేట్ చేయండి.
నమ్మకాన్ని ఇవ్వండి: తమ మనసులోని భావాలను ఎలాంటి భయం లేకుండా పంచుకునేలా వారికి ఒక సేఫ్ స్పేస్ ఇవ్వండి.
నిలకడగా ఉండండి: వారు అడగకపోయినా, వారికి అవసరమైనప్పుడు తోడుగా నిలబడండి.