వరదలకు తడిసిపోయిన పెళ్లి ఆల్బమ్‌.. షాకింగ్‌ నిర్ణయం తీసుకున్న మహిళ.. ఏం చేసిందంటే..?

Wedding Album: ప్రపంచంలోని ప్రతి వ్యక్తికి వివాహం చాలా ముఖ్యమైన ఘట్టం. ఆ రోజును వారు అస్సలు మరిచిపోరు. జ్ఞాపకాల కోసం వెడ్డింగ్‌ ఆల్బమ్‌,

వరదలకు తడిసిపోయిన పెళ్లి ఆల్బమ్‌.. షాకింగ్‌ నిర్ణయం తీసుకున్న మహిళ.. ఏం చేసిందంటే..?
Wedding Album
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Dec 25, 2021 | 6:55 AM

Wedding Album: ప్రపంచంలోని ప్రతి వ్యక్తికి వివాహం చాలా ముఖ్యమైన ఘట్టం. ఆ రోజును వారు అస్సలు మరిచిపోరు. జ్ఞాపకాల కోసం వెడ్డింగ్‌ ఆల్బమ్‌, వీడియోలు తీయించుకుంటారు. వారి పెళ్లి ఎలా జరిగిందో ఫొటోలు, వీడియోలు చూస్తూ మురిసిపోతారు. కుటుంబ సభ్యులకు చూపిస్తూ ఆనందిస్తారు. కొంతమంది వాటిని ప్రాణంకంటే ఎక్కువగా ప్రేమిస్తారు. అలాంటి ఆల్బమ్‌ ఒక్కసారిగా దూరమైనా, పాడైపోయినా వారు తట్టుకోలేరు. ఆ వెలితి వారిని నిరుత్సాహపరుస్తుంది. సరిగ్గా ఒక మహిళకు ఇలాగే జరిగింది. వరదల కారణంగా పెళ్లి ఆల్బమ్‌ తడిసి ఫొటోలన్ని పాడైపోయాయి. దీంతో ఆమె బాధ అంతా ఇంతా కాదు. చాలా మదనపడుతు సంచలన నిర్ణయాన్ని బయటపెట్టింది.

దీంతో బాగా ఆలోచించిన ఆ మహిళ భర్తని మరోసారి రెండో పెళ్లి చేసుకోవాలనుకుంది. ఆ విషయం విన్న భర్త ఒక్కసారిగా షాక్‌ అయ్యాడు. ఇది పూర్తిగా నిజం. ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. దీనిని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఇది మలేసియా నుంచి వచ్చిన ఒక వీడియో. గత వారం అక్కడ వరదలు చాలా విధ్వంసం సృష్టించాయి. వరద బాధితులను ఓ విలేకరి ఇంటర్వ్యూ చేయగా, అందులో ఓ మహిళ ఈ బాధను వ్యక్తం చేసింది. వీడియోలో ఆ మహిళ తన పెళ్లి ఆల్బమ్‌ని చూపించి, వరదలో తన ఫొటోలు పాడైపోయాయని ఇలాంటి పరిస్థితుల్లో రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పింది. దీంతో అందరు ఒక్కసారిగా షాక్‌ అయ్యారు.

వీడియో చూసిన సోషల్ మీడియా యూజర్లు ఆమె నిర్ణయానికి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వీడియోలో మహిళ మాట్లాడుతున్న తీరు కూడా అందరికీ నచ్చుతుంది. ఆమె తన పెళ్లి ఫొటోలను చూపుతూ ‘నా పెళ్లి ఫొటోలు వరదలో చెడిపోయాయి. ఈ పరిస్థితిలో నేను నా భర్తను మళ్లీ పెళ్లి చేసుకుంటాను. అప్పుడు మళ్లీ ఫొటోలు తీయించుకోవచ్చని’ అంటోంది. ప్రజలు తమ జీవితంలో ఒక్కసారే పెళ్లి చేసుకుంటారని, తనకు పెళ్లయి దాదాపు 20 ఏళ్లు అవుతోందని తెలిపింది. ఇప్పుడు తన భర్తను మళ్లీ పెళ్లి చేసుకోమని కోరగా అతను నిరాకరించాడని తన బాధను తెలియజేసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

భారతదేశానికి పొంచి ఉన్న మరో ముప్పు.. నీటి కోసం పోరాటం తప్పదా..?

ఉద్యోగులకు శుభవార్త.. త్వరలో పీఎఫ్ అమౌంట్‌ పెరిగే అవకాశం.. వేతన సరళిలో మార్పులు

RBI: ఆ బ్యాంకుపై ఆర్బీఐ 30 లక్షల జరిమానా.. రెండు సహకార బ్యాంకులపై చర్యలు.. ఎందుకంటే..?