Funny Video: అయ్యో అయ్యో అయ్యయ్యో.. పెళ్లై గంట కూడా కాలే.. అప్పుడే చితక్కొట్టుడు కొట్టేసింది..

|

Mar 15, 2023 | 4:38 PM

వివాహం అనేది రెండు కుటుంబాల కలయిక. సంప్రదాయం ప్రకారం జరిగే పెళ్లి తంతులో ఎన్నో ఆసక్తికర ఘట్టాలు ఉంటాయి. కొన్ని సన్నివేశాలు కడుపుబ్బా నవ్వుకునేలా ఉంటాయి.

Funny Video: అయ్యో అయ్యో అయ్యయ్యో.. పెళ్లై గంట కూడా కాలే.. అప్పుడే చితక్కొట్టుడు కొట్టేసింది..
Couple Video
Follow us on

వివాహం అనేది రెండు కుటుంబాల కలయిక. సంప్రదాయం ప్రకారం జరిగే పెళ్లి తంతులో ఎన్నో ఆసక్తికర ఘట్టాలు ఉంటాయి. కొన్ని సన్నివేశాలు కడుపుబ్బా నవ్వుకునేలా ఉంటాయి. మరికొన్ని ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. అలాంటిదే పెళ్లికి సంబంధించిన ఓ కార్యం వీడియో సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. పెళ్లికి వచ్చిన వారు ఆ సన్నివేశాలను చూసి కడుపుబ్బా నవ్వుకుంటున్నారు.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో పెళ్లి తరువాత వధువు తన భర్తను కొట్టే ఆచారం ఉంది. అంటే ఆచారం అంటే అదేదో పెద్ద తంతు అనుకునేరు. అలాంటిదేమీ లేదు.. జస్ట్ సరదా స్కిట్ మాత్రమే. పెళ్లి కొడుకు పాన్పుపై బోర్లా పడుకోగా.. అతని పై బెలూన్‌ని పెడితే.. ఆ బెలూన్‌ని వధువు కర్రతో పగలగొట్టాలన్నమాట. ఒక్కమాటలో చెప్పాలంటే హైడ్ అండ్ సీక్ గేమ్ మాదిరి అన్నమాట.

ఇవి కూడా చదవండి

గేమ్‌లో భాగంగా వరుడు పాన్పుపై పడుకోగా.. అతని బ్యాక్‌పై మరొకరు బెలూన్ పెట్టారు. ఆ బెలూన్‌ను పగలగొట్టడం వధువు టాస్క్. ఇంకేముంది అమ్మడు దొరికిందే ఛాన్స్ అని వీర కుమ్ముడు కుమ్మేసింది. బెలూన్‌ పలగడం ఏమో గానీ.. అతని బ్యాక్ బద్దలైపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్ అయ్యింది. వరుడి పరిస్థితి చూసి అయ్యో అయ్యో అయ్యయో అని నిట్టూరుస్తున్నారు నెటిజన్లు. మరెందుకు ఆలస్యం.. వీడియోపై మీరూ ఓ లుక్కేసుకోండి.


వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..