Viral news: ఫుల్లుగా మద్యం తాగి బడికొచ్చిన లేడీ టీచర్.. కట్ చేస్తే కథ వేరే లేవల్లో.. ఏకంగా మందు బాటిళ్లతో.. వీడియో

|

Sep 09, 2022 | 11:08 AM

 అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ఉపాధ్యాయులే హద్దు మీరి ప్రవర్తిస్తున్నారు. బడిలో పాఠాలు బోధించి విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన ఓ ఉపాధ్యాయురాలు.. ఫుల్లుగా మద్యం తాగి పాఠశాలకు వచ్చింది.

Viral news: ఫుల్లుగా మద్యం తాగి బడికొచ్చిన లేడీ టీచర్.. కట్ చేస్తే కథ వేరే లేవల్లో.. ఏకంగా మందు బాటిళ్లతో.. వీడియో
Teacher
Follow us on

Lady Teacher drinking alcohol: అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ఉపాధ్యాయులే హద్దు మీరి ప్రవర్తిస్తున్నారు. బడిలో పాఠాలు బోధించి విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన ఓ ఉపాధ్యాయురాలు.. ఫుల్లుగా మద్యం తాగి పాఠశాలకు వచ్చింది. అధికారులు పరిశీలనకు రాగా అడ్డంగా బుక్కయింది. ఈ షాకింగ్ ఘటన కర్ణాటకలోని తమకూరు తాలూకాలోని చిక్కసారంగి ప్రాథమిక పాఠశాలలో చోటుచేసుకుంది. చిక్కసారంగి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయిని గంగలక్ష్మమ్మ మద్యం సేవించి పాఠాలు బోధిస్తుండేది. ఆమె 25 ఏళ్లుగా ఈ పాఠశాలలోనే విధులు నిర్వర్తిస్తోంది. అయిదేళ్లుగా ఆమె మద్యానికి బానిస అయింది. నిత్యం మద్యం సేవించి పాఠశాలకు రావడంతోపాటు.. విద్యార్థులను కొట్టడంతోపాటు తిడుతుండేది. అంతేకాకుండా సహ ఉపాధ్యాయులతో వాగ్వాదానికి దిగుతుండేంది. దీంతో విసిగిపోయిన విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పద్దతి మార్చుకోవాలంటూ గంగలక్ష్మమ్మకు సూచించారు. అయినప్పటికీ.. ఆమె వినకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేసి నిరసనకు దిగారు.

ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన విద్యాధికారి బీఇవో హనుమానాయక్‌, పోలీసులకు వింత అనుభవం ఎదురైంది. వారితో కూడా గంగలక్ష్మమ్మ వాదనకు దిగింది. ఆమె ఉదయాన్నే మద్యం తాగి.. క్లాసులు బోధిస్తున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. ఈ సమయంలో ఉపాధ్యాయిని టేబుల్‌డ్రాను పరిశీలించడానికి ప్రయత్నించగా.. గంగలక్ష్మమ్మ అడ్డుకుంది. ఆ తర్వాత పోలీసులు, గ్రామస్థులు టేబుల్‌ డ్రాను బయటకు తీసుకొచ్చి తాళాలు పగులగొట్టి చూశారు. దానిలో ఓ మద్యం సీసా, మరో రెండు ఖాళీ సీసాలు కనిపించాయి. దీంతో పోలీసులు, అధికారులు అవాక్కయ్యారు. ఈ పరిణామంతో.. గంగలక్ష్మమ్మ తన గదిలోకి వెళ్లి తాళాలు వేసుకుంది. ఆత్మహత్య చేసుకొంటానని హంగామా సృష్టించింది.

అనంతరం పోలీసులు ఆమెను సముదాయించి బయటకు తీసుకొచ్చారు. అక్కడినుంచి ఆమెను బీఈవో వాహనంలో తరలించారు. అనంతరం పోలీసులు మద్యం సీసాలను జప్తు చేశారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు ఉపాధ్యాయిని గంగలక్ష్మమ్మను సస్పెండ్‌ చేసి విచారణకు ఆదేశించారు. కాగా.. ఇలాంటి టీచర్ తమకు అవసరం లేదంటూ పట్టుబట్టగా అధికారులు హామీనివ్వడంతో ఆందోళనను విరమించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..