Viral Video: ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌లో వెజ్‌ మంచూరియా ఆర్డర్ చేశాడు.. తిందామని స్పూన్ పెట్టగా..

ఈ మధ్య కాలంలో వెలుగు చూస్తున్న సంఘటనలు చూస్తుంటే బయట తినాలంటేనే వణుకు పుడుతోంది. ఓ వైపు కల్తీ ఆహారం, మరోవైపు అపరిశుభ్రతతో వ్యాపారులు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే సూరత్‌లో వెలుగు చూసింది. వెజ్ మంచూరియా ఆర్డర్ చేసిన వ్యక్తికి ప్లేట్‌లో ఎలుక పిల్లల కనిపించడం తీవ్ర కలకలం రేపింది.

Viral Video: ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌లో వెజ్‌ మంచూరియా ఆర్డర్ చేశాడు.. తిందామని స్పూన్ పెట్టగా..
Dead Rat In Manchurian Surat

Updated on: Jul 22, 2026 | 3:02 PM

కాసులకు కక్కుర్తి పడి కొందరు కల్తీ ఆహారంతో ప్రజల ప్రాణాలు తీస్తుంటే.. మరికొందరు నాణ్యత లేని ఆహరం, ఆపరిశుభ్రతతో వారి పాలిట శాపంగా మారుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే సూరత్‌లో వెలుగు చూసింది. సచిన్ ప్రాంతంలోని పాలి గ్రామంలో ఉన్న జై హనుమాన్ చైనీస్ సెంటర్ లో మంచూరియా తినేందుకు వచ్చిన కస్టమర్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. అతనికి ఇచ్చిన ప్లేట్‌లో మంచూరియాతో పాటు చనిపోయిన ఎలుక దర్శనమిచ్చింది. అది చూసిన కష్టమర్ ఆగ్రహానికి లోనై నిర్వహకులను నిదీశాడు. అనంతరం ఇందుకు సంబంధించిన వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో వేగంగా వైరల్ అయి, చర్చనీయాంశంగా మారింది.

ఆ చైనీస్ సెంటర్ ఎంతటి అపరిశుభ్రంగా ఉందో ఈ వీడియోలో క్లియర్‌గా కనిపిస్తోంది. వంటగదిలో పరిశుభ్రత లోపించడం, ఆహార భద్రతా నియమాలను పాటించకపోవడంపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాపారాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక ఘటనపై సమాచారం అందుకున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని తనిఖీలు చేపట్టింది. తనిఖీల్లో భాగంగా షాపులో పరిశుభ్రత లేదని, ఎలాంటి ట్రేడ్ లైసెన్స్ లేకుండా షాప్ నిర్వహిస్తున్నారని తేలింది. దీంతో అధికారులు నిర్వహాకులకు నోటీసులు జారీ చేశారు.

అలాగే ఆహార భద్రతా నియమాలను ఉల్లంఘించినందుకు, తీవ్ర నిర్లక్ష్యం వహించినందుకు గానూ ఫుడ్ సేఫ్టీ విభాగం యజమానికి రూ.10,000 జరిమానా విధించింది. అంతేకాకుండా, దుకాణంలో పూర్తిగా పరిశుభ్రత పాటించాలని, శుభ్రమైన వాతావరణంలోనే ఆహారాన్ని తయారు చేయాలని కఠిన ఆదేశాలు జారీ చేసింది. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి పొరపాట్లు పునరావృతమైతే మరింత కఠినమైన చట్టపరమైన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు.

వీడియో చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి,

Loading...
Unable to load recommendations.
Follow Us