Viral Video: పోతవ్‌రరేయ్‌… ఓ పోలీసులు చూసినారుల్లా… బైకర్‌ డేంజరస్‌ స్టంట్‌పై నెటిజన్స్‌ ఫైర్‌

సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతి ఒక్కరు ఏదోరకంగా ఫేమస్‌ కావాలని చూస్తున్నారు. రకరకాల రీల్స్‌ చేస్తూ అప్‌లోడ్‌ చేస్తున్నారు. అందులో కొన్ని ఫన్నీగా ఉంటే మరికొన్ని ప్రాణాల మీదకు తెచ్చుకునేలా ఉంటాయి. రాత్రికి రాత్రే స్టార్స్‌ అయిపోయేందుకు ప్రాణాలను ఫణంగా పెట్టి మరీ రీల్స్‌...

Viral Video: పోతవ్‌రరేయ్‌... ఓ పోలీసులు చూసినారుల్లా... బైకర్‌ డేంజరస్‌ స్టంట్‌పై నెటిజన్స్‌ ఫైర్‌
Byker Stunt On Road

Updated on: Sep 18, 2025 | 6:15 PM

సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతి ఒక్కరు ఏదోరకంగా ఫేమస్‌ కావాలని చూస్తున్నారు. రకరకాల రీల్స్‌ చేస్తూ అప్‌లోడ్‌ చేస్తున్నారు. అందులో కొన్ని ఫన్నీగా ఉంటే మరికొన్ని ప్రాణాల మీదకు తెచ్చుకునేలా ఉంటాయి. రాత్రికి రాత్రే స్టార్స్‌ అయిపోయేందుకు ప్రాణాలను ఫణంగా పెట్టి మరీ రీల్స్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదాలభారిన పడి ప్రాణాలు పొగొట్టుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. మరికొందరు శాశ్వత అంగవైకల్యం పొంది మంచానికే పరిమితమయ్యారు. అయినా యువకులు మాత్రం డేంజరస్‌ స్టంట్స్‌ చేయడం మాత్రం మానడం లేదు.

ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఓ డేంజరస్‌ స్టంట్‌కు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది. యూపీలో ఓ వ్యక్తి బైక్‌పై విన్యాసాలు ప్రదర్శించాడు. అంతేకాదు ఈ విన్యాసం చేసినందుకు చిక్కుల్లో పడ్డాడు. బిజ్నోర్‌ జాతీయ రహదారిపై ఓ వ్యక్తి హై స్పీడ్‌ స్పోర్ట్స్‌ బైక్‌పై డేంజరస్‌గా స్టంట్స్‌ చేశాడు. బైక్‌ సీటుపై నిలబడి సాహసోపేత విన్యాసం ప్రదర్శించాడు. మరో వ్యక్తి ఈ తతంగాన్నంతా వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు.

వీడియో చూడండి:

వీడియో ఓ వ్యక్తి హెల్మెట్‌ పెట్టుకుని రన్నింగ్‌ స్పోర్ట్స్‌ బైక్‌పై నిల్చుంటాడు. ఒక కాలు సీటుపై పెట్టి, మరొక కాలును హ్యండిల్‌ మీద పెట్టి బ్యాలెన్స్‌ చేస్తుంటాడు. బైక్‌ స్పీడ్‌గా దూసుకెళుతుంటుంది. టోల్‌గేట్‌ దగ్గరికి రాగానే గేటు ఓపెన్‌ అవడం వీడియోలో కనిపిస్తుంది. రోడ్డు మీద ఓ ట్రాక్టర్‌ను ఓవర్‌టేక్‌ చేయడం కనిపిస్తుంది. ట్రాక్టర్‌లో కూర్చున్న మహిళా ప్రయాణికులు బైకర్‌ స్టంట్‌ను ఆసక్తికరంగా చూస్తుంటారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌ అయ్యింది.

వైరల్‌ వీడియోపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. వైరల్‌ వీడియో పోలీసుల వరకు వెళ్లడంతో మీరట్‌ పోలీసులు రియాక్ట్‌ అయ్యారు. బైకర్‌పై చర్యలు తీసుకునేందుకు అతడిని గుర్తించే పనిలో పడ్డారు. సదరు వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. యువకులు ఇలాంటి ప్రమాదకర స్టంట్స్‌ జోలికి వెళ్లకూడదని హెచ్చరించారు.