
నేటి కాలంలో సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసం జనం ఎంతటి సాహసానికైనా, చివరికి ప్రాణాల మీదకు వచ్చే పనులకైనా వెనుకాడటం లేదు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక వీడియో చూస్తే మానవత్వం ఎటు పోతోంది అనే సందేహం కలగక మానదు. ఒక మహిళ తన చంటి బిడ్డను స్కూటీ స్టోరేజ్ బాక్స్‌లో పెట్టి లాక్ చేసిన దృశ్యం ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ షాకింగ్ వీడియో ప్రస్తుతం నెటిజన్లను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తోంది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌కు చెందినదిగా తెలుస్తోంది. ఈ వీడియోలో, ఒక మహిళ తన పసిబిడ్డను స్కూటీ సీటు కింద ఉండే స్టోరేజ్ బాక్స్ (డిక్కీ)లో పడుకోబెట్టి, సీటు మూసివేసి దర్జాగా వాహనంపై వెళ్లడం కనిపిస్తుంది. కేవలం 17 సెకన్ల నిడివి గల ఈ వీడియో చూసి జనం విస్తుపోతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే…
అసలేం జరిగింది?:
వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఒక మహిళ తన ఇంటి ముందు పార్క్ చేసిన స్కూటీ వద్దకు బిడ్డను ఎత్తుకుని వచ్చింది. అంతవరకు సాధారణంగానే ఉన్నా, ఆ తర్వాత ఆమె చేసిన పని అందరినీ షాక్‌కు గురిచేసింది. స్కూటీ సీటు తెరిచి, హెల్మెట్ లేదా సామాన్లు పెట్టుకునే డిక్కీలో పసిబిడ్డను పడుకోబెట్టింది. ఆపై ఏమాత్రం కనికరం లేకుండా సీటును బలంగా మూసివేసింది. అనంతరం ఏమీ ఎరుగనట్టు స్కూటీపై కూర్చుని వెళ్లడం ఆ వీడియోలో కనిపిస్తుంది.
సాధారణంగా స్కూటర్ డిక్కీలో గాలి ప్రసరణ అస్సలు ఉండదు. సీటు మూసివేసిన తర్వాత లోపల ఉన్న వ్యక్తికి ఊపిరి ఆడటం చాలా కష్టం. పైగా ఇంజిన్ పక్కనే ఉండటం వల్ల ఆ వేడికి పసిబిడ్డ తీవ్ర అసౌకర్యానికి గురయ్యే అవకాశం ఉంది. కేవలం ఒక రీల్ కోసం లేదా సరదా కోసం బిడ్డ ప్రాణాలను పణంగా పెట్టడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
వీడియో ఇక్కడ చూడండి..
A mother put her baby in the scooter’s storage box like luggage, on just a pillow, then drove off.
Heartbreaking and dangerous, what if there’s an accident? That tiny life is everything.
Please, protect our kids. This can’t be “content.” 😢 pic.twitter.com/HKXhQ8UgKL
— Sachya (@sachya2002) March 11, 2026
ఈ వీడియోపై నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. ఇది తల్లి చేసే పనేనా?, ఆ బిడ్డకు ఊపిరి ఆడకపోతే పరిస్థితి ఏంటి? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఆ స్కూటీ నంబర్ ప్లేట్‌పై MP (మధ్యప్రదేశ్) అని ఉండటంతో, ఆ రాష్ట్ర పోలీసులు దీనిపై స్పందించి సదరు మహిళపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అయితే, ఇది కేవలం అవగాహన కోసం లేదా వ్యూస్ కోసం తీసిన స్క్రిప్టెడ్ వీడియో అయి ఉండవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ, ఇలాంటి ప్రమాదకరమైన పనులను సోషల్ మీడియాలో ప్రదర్శించడం సమాజానికి తప్పుడు సంకేతాలు పంపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..