Viral Video: అప్పుడప్పుడు ఆశ్చర్యం కలిగించే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. వీడియోలు ఎక్కువగా వైరల్ అయ్యేది సోషల్ మీడియానే. అయితే చాలా మంది నిద్రపోయిన తర్వాత ఉదయాన్నే లావాలంటే బద్దకంగా ఉంటుంది. అలాంటి వారు మొబైల్‌లోనే, వాచ్‌లలోనో అలరం పెట్టుకుంటారు. కానీ మాత్రం నిద్ర లేవడం ఆలస్యమైతే చాలు ఏనుగు వచ్చి నిద్ర లేపోతుంది. ఉదయాన్నే మేల్కొలపడానికి తెల్లవారు జామునే ఏనుగు వచ్చి కిటికిలోంచి తన తొండంతో నిద్ర లేపుతుంది.
థాయ్‌లాండ్‌లోని ఓ హోటల్ గదిలో ఓ మహిళ మంచంపై హాయిగా నిద్రిస్తుండగా తెల్లవారుజామూనే ఆ ఏనుగు వచ్చి నిద్ర లేపుతుంది. మహిళను ఏనుగు తన తొండంతో కదిలించి నిద్ర లేపే ప్రయత్నం చేస్తుంది. ఇలా ఏనుగు ఉదయాన్నే నిద్రలేపోతుండగా, ఒక్కసారిగా మహిళ లేచి చూసి ఆశ్చర్యపోయింది.
ఈ వీడియోను సాక్షి జైన్ అనే ప్రముఖ లైఫ్ స్టైల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. అప్పటి నుంచి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల షేర్ చేసిన ఈ వీడియోకు 23 లక్షలకుపైగా లైక్‌లను, 70 మిలియన్ల వ్యూస్ అందుకుంది. దీనికి 3వేలకుపైగా కామెంట్లు వచ్చాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి