
Women Catches Huge Fish: సామాజిక మాధ్యమాల్లో రోజూ ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. కానీ, కొన్ని వీడియోలు చూసినప్పుడు మాత్రం నోరెళ్లబెట్టడం ఖాయం. ప్రస్తుతం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్న ఒక షాకింగ్ వీడియో సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఓ సాధారణ మహిళ ప్రాణాలకు తెగించి చేసిన సాహసం, దానికి దక్కిన ఫలితం చూస్తే ఎవరైనా సరే అవాక్కవ్వాల్సిందే.
చేపలు పట్టడం అనేది ఒక కళ, కొందరికి అదో హాబీ. కానీ ఇక్కడ వైరల్ అవుతున్న వీడియోలో కనిపిస్తున్న దృశ్యం మాత్రం ఊహకు అందని విధంగా ఉంది. మోకాళ్లోతు బురద నీటిలోకి దిగిన ఒక మహిళ, ఏదో సాధారణ చేప కోసం వెతుకుతున్నట్లు కనిపించలేదు. నీటి అడుగున ఏదో పెద్ద జీవి కదలికలను గమనించిన ఆమె, ఏమాత్రం భయం లేకుండా నేరుగా చేతులతోనే దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించింది. ఆ నీటి అడుగున ఉన్న క్యాట్ ఫిష్ ఆమె పట్టు నుంచి తప్పించుకోవడానికి తీవ్రంగా పోరాడింది. నీరు బురదగా మారడంతో లోపల ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. కానీ ఆ మహిళ మాత్రం తన పట్టును అస్సలు వదల్లేదు.
ఆ మహిళ పట్టుదల ముందు ఆ జలచరం లొంగిపోక తప్పలేదు. కాసేపు నీటిలోనే ఆ జీవితో హోరాహోరీగా పోరాడిన తర్వాత, ఆమె దాన్ని గట్టిగా పట్టుకుని నీటిపైకి లేపింది. అంతే, ఆ దృశ్యం చూసి అక్కడున్న వారితో పాటు వీడియో చూస్తున్న నెటిజన్ల గుండె ఒక్కసారిగా జారినంత పనైంది. ఆమె చేతుల్లో ఉన్నది సాదాసీదా చేప కాదు, దాదాపు ఆమె శరీర పరిమాణంలో ఉన్న ఒక భారీ క్యాట్‌ఫిష్ . అంత భారీ కాయం ఉన్న ఆ చేపను ఒక మహిళ ఒంటరిగా, అదీ ఎలాంటి వల లేదా ఆధునిక ఆయుధాలు లేకుండా కేవలం చేతులతోనే పట్టుకోవడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ఆ రాక్షస చేపను పట్టుకున్న తర్వాత ఆమె ముఖంలో కనిపించిన గర్వం, ఆనందం ఆ వీడియోకే హైలైట్‌గా నిలిచాయి.
誰も予想できない結果に…。 pic.twitter.com/1fxK1QbX4j
— 愛国心🌸🌸 (@otakara18) June 7, 2026
ట్విట్టర్ (ఎక్స్) వేదికగా షేర్ అయిన ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. కేవలం కొద్ది రోజుల్లోనే ఈ విజువల్స్ 4.3 లక్షలకు పైగా వీక్షణలను (Views) సొంతం చేసుకుని రికార్డు సృష్టిస్తున్నాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. “ఆమె పట్టుదలకు హాట్సాఫ్, అంత పెద్ద చేపను చూస్తేనే భయమేస్తుంది” అని కొందరు కామెంట్స్ చేస్తుంటే, మరికొందరైతే అసలు అది క్యాట్‌ఫిష్ యేనా లేక భారీ ఈల్ (పాము చేప) రకానికి చెందినదా? అని చర్చించుకుంటున్నారు. విచిత్రంగా ఒక నెటిజన్ అయితే అది అసలు నిజమైన చేపేనా లేక అద్భుతమైన శిల్పకళాఖండమా? అని ఆశ్చర్యం వ్యక్తం చేయడం గమనార్హం.
మరిన్ని ట్రెండింగ్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..