Viral Video: ముంగిస – పాము మధ్య భీకరపోరు.. వీడియో చూస్తే షాకవుతారు..!

Viral Video: అడవుల్లో కొన్ని రకాల పాములుంటాయి. కొన్ని పాములు కాటేస్తే క్షణాల్లోని మనిషి చనిపోయేలా ఉంటాయి. అలాంటి విషపూరితమైన పాముల జోలికి వెళ్లడం ధైర్యం కావాల్సిందే..

Viral Video: ముంగిస - పాము మధ్య భీకరపోరు.. వీడియో చూస్తే షాకవుతారు..!
Viral Video

Updated on: Aug 26, 2022 | 11:44 AM

Viral Video: అడవుల్లో కొన్ని రకాల పాములుంటాయి. కొన్ని పాములు కాటేస్తే క్షణాల్లోని మనిషి చనిపోయేలా ఉంటాయి. అలాంటి విషపూరితమైన పాముల జోలికి వెళ్లడం ధైర్యం కావాల్సిందే. అయితే సాధారణంగా సోషల్‌ మీడియాలో పాములు, మొసళ్లు, పులులు, ఇతర జంతువుల వీడియోలు తెగ వైరల్‌ అవుతుంటాయి. ఏదైనా వీడియో వైరల్‌ అయ్యిందంటే చాలు అది సోషల్‌ మీడియా అని చెప్పక తప్పదు. ఇక పాము-ముంగిస గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాముకు ముంగీస ఎదురు పడిందంటే చాలు రెండింటి మధ్య యుద్ధమే. పాముతో మరిమరి పోరాడేది అంటే అది ముంగిసనే. అయితే ఇక్కడ ముంగిస జాతికి చెందిన ఓ జంతువు ప్రమాదకరమైన పాముతో ఎలా పొట్లాడుతుందో ఈ వీడియోను చూస్తే తెలిసిపోతుంది. పచ్చటి ప్రమాదకరమైన పాముకు ఏ మాత్రం భయపడకుండా అది తెగ పోరాడుతుంది. చివరకు పాము చెట్టుదిగి వెళ్లిపోయింది.

రెండు జాతుల మధ్య కొంతసేపు భీకరపోరు కొనసాగింది. ఈ ముంగీస జాతికి చెందిన జంతువును గొర్రెల కాపరులు మరపట్టి అని అంటారు. ఈ రెండు కూడా ఒకే చెట్టుకొమ్మపై ఎదురెదురుగా ఉండి పెద్ద యుద్ధమే చేశాయి. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ ఆకస్మిక దాడిలో పాము వెనక్కి తగ్గుతుంది. అయినా ఈ ముంగిస జాతికి చెందిన జంతువు ఏ మాత్రం ఊరుకోకుండా ఎదురు దాడికి దిగడం ఈ వీడియోలో చూడవచ్చు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us