
చాలా మంది రీల్స్ పిచ్చిలో పడి పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నారు. ఒకడు రైలుకు ఎదురెళ్తున్నాడు, ఇంకొకడు కొండ మీద నుంచి దూకేస్తున్నాడు, మరొకడు ర్యాష్ డ్రైవింగ్‌తో రోత పుట్టిస్తున్నాడు. ఈ రీల్స్ పిచ్చితో ప్రాణాలంటే లెక్కలేకుండా ఉన్నారు. తాజాగా ఓ యువకుడు కూడా అలాంటి మతిలేని పనితో ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఒక పెద్ద దాదాపు పది అడుగులు ఉన్న విషపూరిత పామును పట్టుకొని గాల్లోకి లేపుతూ రీల్ షూట్ చేసేందుకు రెడీ అయ్యాడు.
అనుకున్నట్లే పెద్ద పామును పట్టుకొని గాల్లోకి లేపుతూ మరో వైపు ఫొటో పెట్టుకున్నాడు. కానీ విషజీవి ఊరుకుంటుందా? వీడు నన్నేదో చేసేలా ఉన్నాడని భయపడిందో ఏమో కానీ దాని సహజ గుణం చూపించింది. తనను పట్టుకున్న ఆ యువకుడి చెంపపై కస్సు కాటేసింది. అంతే.. దెబ్బకు షాక్ తిన్న యువకుడు ఆ పామును విసిరేస్తూ ప్రాణభయంతో పరిగెత్తాడు. అయితే పాముతో రీల్ చేసి వైరల్ అవుదాం అనుకున్నవాడు.. ప్రాణాలు కాపాడుకునేందుకు ఆస్పత్రికి పరుగులు తీశాడు. ప్రస్తుతం పాము కాటేసిన ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో chitransh_bhai_2.0 అనే ఇన్‌స్టా అకౌంట్‌లో పోస్ట్ అయి ఉంది. ఆ అకౌంట్ చెక్ చేయగా.. అతను పాములు, ఇతర బల్లి జాతి జంతువులను పట్టుకుంటూ వాటితో రీల్స్ తీసుకుంటూ ఉంటాడనే విషయం తెలుస్తోంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి