Viral Video: నవ్వీ నవ్వీ కడుపు నొస్తే మాత్రం నాకు తెల్వదు… ఈ వీడియోను చూస్తే మాత్రం నవ్వు ఆపుకోలేరు

జంతువులకు సంబంధించిన వీడియోలు ప్రతిరోజు సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంటాయి. ఇక పెంపుడు జంతువులకు సంబంధించిన వీడియోలైతే ఫన్నీగా ఉంటాయి. అవి చేసే పనులు నవ్వు తెప్పిస్తుంటాయి. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు నెటిజన్లు నవ్వుల్లో ముంచెత్తుతుంది. ఓ ఇంటి ఆవరణలో జంతువుల మధ్య జరిగిన...

Viral Video: నవ్వీ నవ్వీ కడుపు నొస్తే మాత్రం నాకు తెల్వదు... ఈ వీడియోను చూస్తే మాత్రం నవ్వు ఆపుకోలేరు
Dog Imitate Tortoice

Updated on: Sep 13, 2025 | 8:30 PM

జంతువులకు సంబంధించిన వీడియోలు ప్రతిరోజు సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంటాయి. ఇక పెంపుడు జంతువులకు సంబంధించిన వీడియోలైతే ఫన్నీగా ఉంటాయి. అవి చేసే పనులు నవ్వు తెప్పిస్తుంటాయి. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు నెటిజన్లు నవ్వుల్లో ముంచెత్తుతుంది. ఓ ఇంటి ఆవరణలో జంతువుల మధ్య జరిగిన సంఘటన చూసి సోసల్‌ మీడియా జనాలు ఓ రేంజ్‌లో నవ్వుకుంటున్నారు. ఈ వీడియో నెట్టింటిలో తెగ వైరల్‌ అవుతోంది.

ఈ వీడియోను varalaxmiparigi అనే ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేశారు. లక్షల మంది వీక్షించారు. వీడియో ప్రారంభంలో ఇంటి పెరట్లోకి ఓ పెద్ద తాబేలు వచ్చినట్లు కనినిస్తుంది. బయటికి వెళ్లేందుకనుకుంటా కాంపౌండ్ గేటు వైపు నెమ్మదిగా ఆడుగులేస్తూ వెళుతుంటుంది. అయిఏత ఇక్కడో తమాషా సంఘటన జరిగింది. తాబేలును గమనించిన కుక్క పిల్ల దాని వద్దకు వెళ్లింది. తాబేలును చూసి మొరుగుతుంది. అయితే అంతా కరవడానికి వెళ్తుందేమో అనుకుంటారు. గానీ, అందుకు పూర్తి విరుద్ధంగా కుక్క పిల్ల ప్రవర్తించింది. తాబేలు నడకను అనుకరిస్తూ అచ్చం అలాగే నడవడానికి కుక్క పిల్ల ప్రయత్నించిన తీరు అందరినీ నవ్వు తెప్పిస్తుంది.

కుక్క పిల్ల తన కాళ్లను వెనుకకు పూర్తిగా చాపి.. ఈడ్చుకుంటూ తాబేలు తరహాలో మెల్లగా ముందుకు పాకుతుంది. ఇలా కొంత దూరం వరకూ తాబేలు మాదిరి నడుస్తూ దాన్ని వెక్కిరించే ప్రయత్నం చేసింది. ఈ సమయంలో తాబేలు కుక్క పిల్లను అదో రకంగా చూడటం వీడియోలో కనిపిస్తుంది. దీనికి వెటకారం ఎక్కువైంది అన్నట్లుగా తాబేలు ఎక్స్‌ప్రెషన్స్‌ ఇచ్చింది. దీంతో నాకెందుకులే అనుకుంటూ అక్కడి నుంచి పక్కకు వెళ్లిపోయే ప్రయత్నం చేసింది తాబేలు. ఆ తర్వాత కుక్కపిల్ల మామూలుగా నడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

ఆ దృశ్యాలు మొత్తం ఆ ఇంటి యజమాని తన కెమెరాలో బంధించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఈ కుక్కకు వెటకారం బాగా ఎక్కువనుకుంటా’.. అంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు. ‘మనం ఎవరితో ఉంటామో.. వారికి కూడా అలాంటి అలవాట్లే వస్తాయి’ అంటూ మరికొందరు ఫన్నీ పోస్టులు పెడుతున్నారు.

వీడియో చూడండి: