Watch Video: విమానాన్ని వంటగదిగా మార్చేసిన మహాతల్లి.. ఏం చేస్తుందో చూడండి!

విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు మీకు ఆకలి వేస్తే ఏం చేస్తారు. విమాన సిబ్బందిని అడిగి ఏమైనా తెప్పించుకొని తింటారు. కానీ ఇక్కడో మహిళ మాత్రం ఏకంగా విమానంలోనే పాస్తాను ఇన్‌స్టెంట్‌గా తయారు చేసింది. దాన్నంతా వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Watch Video: విమానాన్ని వంటగదిగా మార్చేసిన మహాతల్లి.. ఏం చేస్తుందో చూడండి!
Fresh Pasta On Flight

Updated on: Sep 16, 2025 | 7:34 PM

విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు మీకు ఆకలి వేస్తే ఏం చేస్తారు. విమాన సిబ్బందిని అడిగి ఏమైనా తెప్పించుకొని తింటారు. కానీ ఇక్కడో మహిళ మాత్రం ఏకంగా విమానంలోనే పాస్తాను ఇన్‌స్టెంట్‌గా తయారు చేసింది. దాన్నంతా వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌ అవుతున్న ఈ వీడియో.. బ్రూక్స్ అనే ఒక మహిళ
ఒక గిన్నె పట్టుకుని, అందులోకి కొంత పిండిని తీసుకొని.. దానితో పాస్తాను తయారు చేసింది. ఆ తర్వాత దీన్నంతా వీడియో తీసి.. మీకు విమాన ఆహారం అంటే ఇష్టం లేకుంటే.. మీరే ఇలా ఈజీగా తయారు చేసుకోండి అని క్యాప్షన్‌తో ఆ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

వైరల్‌గా మారిన ఈ వీడియో 8.1 మిలియన్లకు పైగా వీవ్స్‌ను సంపాధించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్‌ చేస్తున్నారు. కొంతమంది ఆమె అలా చేయడం తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించవచ్చని రాసుకొస్తే.. మరికొందరు సోషల్‌ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసం ఇలాంటి వీడియో చేస్తున్నట్టు రాసుకొచ్చారు.మరో వ్యక్తి ఆశ్చర్యంగా ఇలా రాశాడు.. నన్ను గింజలతో నిండిన చిన్న మేసన్ జార్‌ను కూడా ఫ్లైట్‌లోకి తీసుకురానివ్వలేదు. కానీ మిమ్మల్ని అన్ని వస్తువులను ఎలా తీసుకురావడానికి అనుమతించారు. అని ప్రశ్నించాడు.

వీడియో చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.