ప్రపంచం చాలా పురోగతి సాధించింది. మనుషులు అంబరాన్ని తాకుతున్నారు.. సముద్రంలో లోతులు కొలుస్తూ చేపలా ఈదుతున్నాడు. క్షణాల్లో ప్రపంచంలో ఎక్కడ ఎప్పుడు ఏమి జరిగినా తెలుకుంటున్నాడు. మానవులు చంద్రుడిపై అడుగు పెట్టారు. అంగారక గ్రహంపైకి వెళ్ళడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లకు పైగా అయినా.. నేటికీ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ప్రదేశాలు అనేకం ఉన్నాయి. కొన్ని కొన్ని గ్రామాల్లో రోడ్డు సదుపాయాలుండవు. కాంక్రీట్ ఇళ్లు కనిపించవు, వాగులు వంకలు దాటడానికి ఎటువంటి సదుపాయాలు ఉండవు. ఇలాంటి ప్రదేశంలో చిన్నారుల చదువు అంటే ప్రాణాలను పణంగా పెట్టాల్సిందే. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో కొంతమంది అమ్మాయిలు తమ ప్రాణాలను పణంగా పెట్టి పాఠశాలకు వెళ్తున్నారు. ఓ స్కూల్ స్టూడెంట్ నదికి ఇటువైపు నిలబడి నదిని దాటేందుకు ప్రయత్నిస్తున్నట్లు వీడియోలో చూడవచ్చు. నిజానికి నదికి ఇటువైపు నుంచి అటువైపును కలుపుతూ ఒక తాడు కట్టి ఉంది. ఆ తాడు సాయంతో బాలిక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నది దాటింది. ఈ చర్య సాహసం తో కూడినది.. చాలా ప్రమాదకరమైంది. నది దాటే సమయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా ప్రాణాంతకంగా మారవచ్చు, ఎందుకంటే నదిలో నీటి ప్రవాహం చాలా వేగంగా ఉంది. ఎవరైనా నదిలో పడితే క్షణంలో కొట్టుకుపోతారు. అయితే ఈ బాలిక నదిని తాడు సాయంతో చాకచక్యంగా దాటింది. చదువు కోసం తన ప్రాణాలను ప్రమాదంలో పెట్టి మరీ వెళ్తున్న చిన్నారికి చదువు మీద ఉన్న అభిరుచి అందరి ప్రశంసలను పొందుతుంది.
In some parts of the world, children will risk their lives just to get to school. pic.twitter.com/YmqUEvOJsP
— CCTV IDIOTS (@cctvidiots) April 23, 2023
ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ, ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది @cctvidiots అనే IDతో ట్విట్టర్లో షేర్ చేశారు. ‘ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో పిల్లలు పాఠశాలకు వెళ్లడం కోసం తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు’ అనే శీర్షిక ఉంది.
కేవలం 26 సెకన్ల ఈ వీడియోను ఇప్పటి వరకు 10 మిలియన్లకు పైగా వీక్షించగా, 36 వేల మందికి పైగా లైక్ చేసారు. విభిన్న స్పందనలను సొంతం చేసుకుంది. ఇలా స్కూల్‌కి వెళ్లడం ప్రమాదకరమని కొందరు, ‘ఈ చిన్న హీరోకి జీవితాన్ని గడపడం సాహసమే’ అని కొందరు అంటున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..