Viral Video Of Buffalo: వీధికుక్కలే కాదు.. ఇప్పుడు పశువులు కూడా రెచ్చిపోతున్నాయి.. బైకర్‌పై బర్రె దాడి..

ఆ వ్యక్తిని బైక్‌పై నుంచి తోసేసి కింద పడేసింది. ఆపై అతనిపై దాడి చేసింది. ఆ సమయంలో అక్కడున్న మరికొందరు అతడికి సహాయం చేశారు. దాంతో ఆ జంతువు వారిని కూడా బెదిరించే ప్రయత్నం చేసింది. పశువు భయంతో ప్రజలు పరుగులు తీశారు..వాళ్లంతా తమ ప్రాణాలను కాపాడుకోవటం కోసం పారిపోతారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Viral Video Of Buffalo: వీధికుక్కలే కాదు.. ఇప్పుడు పశువులు కూడా రెచ్చిపోతున్నాయి.. బైకర్‌పై బర్రె దాడి..
Buffalo Attack On Bike Ride

Updated on: Jan 09, 2024 | 10:25 AM

వీధుల్లో విచ్చల విడిగా తిరుగుతున్న జంతువుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. చాలా జంతువులు వీధుల్లో తిరుగుతూ ప్రజలపై దాడులు చేయటం, కొన్ని చోట్ల ఆస్తులు ధ్వంసం చేయటం వంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీధుల్లో విహరిస్తున్న పశువులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి ఓ దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వైరల్ వీడియోలో రహదారిపై ట్రాఫిక్ కనిపిస్తుంది. దీంతో రోడ్డు పక్కన వాహనాలు బారులు తీరుతున్నాయి. దీనికి కారణం రెడా. మార్గమధ్యంలో ఒక పశువు నిలబడి ఉంది. అంతలోనే ఒక వ్యక్తి రోడ్డుపై మోటార్ సైకిల్ పై వెళ్తుండగా.. ఆ పశువు ఉన్నట్టుంది అతనిపై దాడి చేయడం కనిపిస్తుంది. మార్గమధ్యంలో నిలబడిన జంతువు ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వచ్చి ఓ వైపు నుంచి వస్తున్న మోటార్‌సైకిల్‌పై దాడి చేసింది. ఆ వ్యక్తిని బైక్‌పై నుంచి తోసేసి కింద పడేసింది. ఆపై అతనిపై దాడి చేసింది. ఆ సమయంలో అక్కడున్న మరికొందరు అతడికి సహాయం చేశారు. దాంతో ఆ జంతువు వారిని కూడా బెదిరించే ప్రయత్నం చేసింది. పశువు భయంతో ప్రజలు పరుగులు తీశారు..వాళ్లంతా తమ ప్రాణాలను కాపాడుకోవటం కోసం పారిపోతారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో X ఖాతా ఘర్ కే కాలేష్ నుండి షేర్‌ చేయబడింది . ఈ వీడియోపై లైక్‌లు, కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ వీడియోపై ‘రోడ్డుపై నడవడం కూడా ప్రమాదకరం.. అత్యంత ప్రమాదకరం వంటి వ్యాఖ్యలు వచ్చాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us