Viral Video: వీడ్కోలు సమయంలో బోరున విలపించిన వరుడు.. కారణమేంటో తెలిస్తే షాక్ అవుతారు..!

Viral Video: పెళ్లి అంటేనే పెద్ద పండుగ. పెళ్లికి సంబంధించి ప్రతీ సన్నివేశం అద్భుతమే. అందుకే ప్రతీ సన్నివేశం కలకాలం గుర్తుండిపోయేలా వీడియో గ్రాఫర్‌ను పెట్టుకుని..

Viral Video: వీడ్కోలు సమయంలో బోరున విలపించిన వరుడు.. కారణమేంటో తెలిస్తే షాక్ అవుతారు..!
Groom

Updated on: Apr 29, 2022 | 9:08 PM

Viral Video: పెళ్లి అంటేనే పెద్ద పండుగ. పెళ్లికి సంబంధించి ప్రతీ సన్నివేశం అద్భుతమే. అందుకే ప్రతీ సన్నివేశం కలకాలం గుర్తుండిపోయేలా వీడియో గ్రాఫర్‌ను పెట్టుకుని ప్రతీది రికార్డ్ చేయిస్తారు. అయితే, పెళ్లిళ్లకు సంబంధించిన ఫన్నీ వీడియోలు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. తాజాగా పెళ్లికి సంబంధించినదే ఓ ఫన్నీ వీడియో నెట్టింట్లో తెగ రచ్చ చేస్తోంది. ఆ వీడియోను చూసి నెటిజన్లు ఫుల్ ఖుషీ అవుతున్నారు. వరుడు చేసిన అల్లరి పనికి నవ్వుకుంటున్నారు.

ఇంతకీ ఆ పెళ్లి కొడుకు ఏం చేసిండో ఒకసారి లుక్కేద్దాం. సాధారణంగా పెళ్లి తంతు అంతా ముగిశాక అప్పగింతలు జరుపుతారు. అప్పగింత సమయంలో వధువు, వధువు కుటుంబ సభ్యులు, బంధువులు ఏడుస్తారు. అయితే, ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. వధువుకు బదులుగా వరుడు బోరున విలపించసాగాడు. క్లాత్ అడ్డుపెట్టుకుని బోరున కన్నీటిపర్యంతం అయ్యాడు. హలో.. హలో.. ఒక్కసారి ఆగండి. ఇదంతా నిజమనుకునేరు. తన పెళ్లిన మరింత ఫన్ చేసేందుకు ఇలా ఏడ్చాడు ఆ పెళ్లి కొడుకు. పెళ్లి కొడుకు చేసిన అల్లరికి ఆ నవ వధువు పడి పడి నవ్వింది. కాగా, ఈ ఫన్నీ వీడియోను చూసి నెటిజన్లు ఫుల్లుగా నవ్వుకుంటున్నారు. ఇన్‌స్టాగ్రమ్‌లో షేర్ చేసిన ఈ వీడియోకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. వరుడి ఫర్ఫార్మెన్స్‌కి ఫిదా అయిపోతున్నారు.

Also read:

Healthy Oats: త్వరగా బరువు తగ్గాలని భావిస్తున్నారా?.. ఓట్స్‌ని ఈ 4 విధాల్లో తీసుకోండి..

Viral Video: ఆడ పులి కోసం రెండు పులుల మధ్య భీకర పోరు.. వీడియో చూస్తే గుండెలదరాల్సిందే..!

Health Tips: ఉదయం లేవగానే భుజాలు బిగుసుకుపోతున్నాయా? ఈ సమస్యకు ఈజీగా చెక్ పెట్టండి..!

Follow Us