
ఎవరైనా పిచ్చి చేష్టలు చేస్తుంటే కోతులతో పోలుస్తూ తిడుతుంటారు. కోతులంటేనే అదొకరకమైన భావన నాటుకుపోయింది. అయితే కోతులు కూడా ఒక్కోసారి మనుషులు అవాక్కయ్యేలా చేస్తుంటాయి. మనుషుల వలెనే ప్రవర్తిస్తూ ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. మనుషులు కూడా కోతి నుంచి వచ్చాడంటారు కదా. అదే వేరే విషయం అనుకోండి.. కానీ మనుషులల లెక్కనే ప్రవర్తించే కోతులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.
వైరల్ అవుతోన్న వీడియోలో ఓ కోతి బండ రాయిపై కూర్చుని ఉంది. పర్యాటకులు ఏమైనా ఆహారం ఇవ్వకపోదురా తినకపోదునా అని ఎంతో ఆతృతతో వచ్చిపోచేవారిని చేస్తుంది. ఇంతలో ఓ పర్యాటకుడు కోతిని గమనించి దాని దగ్గరికి చేరుకున్నాడు. ఓ గుడ్డును రాయి మీద కొట్టి ఇక తినమని కోతి చేతికి అందించాడు. గుడ్డును చూసిన కోతి ఎంతో ఆతృతగా దాన్ని గబక్కున లాగేసుకుంటుంది. గుడ్డుతో పండగ చేసుకుందామనుకుని దానిపై ఉన్న పెంకును ఎంతో ఓపిగ్గా ఒలిచింది. అయితే లోపల తెల్లగా ఉండాల్సిన గుడ్డు నల్లగా ఉండటం చూసి కోతికి డౌట్ వచ్చింది. వెంటనే దాన్ని ముక్కు దగ్గరగా పెట్టుకుని వాసన చూసింది. వెంటనే దాన్ని పక్కన విసిరి కొడుతుంది.
అయితే ఆ వాసన భరించలేని విధంగా ఉన్నట్లుంది. కోతికి గుడ్డును పక్కన పడేసిన తర్వాత కూడా వాంతికి వచ్చినట్లు ముఖం పెడుతుంది. నాలుక బయటికి తీసి వాక్.. వాక్.. అంటున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. ఆ వాసనతో చాలా సేపు ఇబ్బంది పడినట్లు ముఖంలో ఫీలింగ్స్ చూపెడుతుంది.
కోతి ఎక్స్‌ప్రెషన్స్‌ను వీడియో తీయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. ‘కోతిని ఇలా ఇబ్బంది పెట్టడం సరికాదు’.. అంటూ కొందరు, ‘కోతి ఎక్స్‌ప్రెషన్స్ మామూలుగా లేవుగా’.. అంటూ మరికొందరు పోస్టులు పెడుతున్నారు.
बंदर समझा था नाश्ता मिलेगा
क़िस्मत ने मज़ाक कर दिया।
खुशी से घिन तक का सफ़र बस एक पल का था
ज़िंदगी कभी-कभी ऐसे ही अंडे दे देती है 🤔 pic.twitter.com/fEATquwwRm— Arzoo Alam (@ArzooAl34714966) November 6, 2025