Viral Video: వామ్మో.. వీడు మనిషి కాదు.. బస్తా నిండా నాగుపాములు తీసుకొచ్చి ఏం చేశాడంటే..?

Trending Video: వినడానికి, చూడటానికి ఎంత ఆసక్తికరంగా అనిపించినా.. పాములతో ఇలాంటి విన్యాసాలు చేయడం అత్యంత ప్రమాదకరం. ఏ చిన్న తప్పిదం జరిగినా ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది కాబట్టి, శిక్షణ లేని వారు లేదా సాధారణ ప్రజలు ఇలాంటి సాహసాలకు ఎప్పుడూ పూనుకోకూడదు.

Viral Video: వామ్మో.. వీడు మనిషి కాదు.. బస్తా నిండా నాగుపాములు తీసుకొచ్చి ఏం చేశాడంటే..?
Dangerous Snake Video

Updated on: Jul 20, 2026 | 3:37 PM

Dangerous Snake Video: మనం దూరంగా ఒక చిన్న పామును చూస్తేనే భయంతో గుండె ఆగిపోయినంత పనవుతుంది. అటువంటిది, వందలాది విషసర్పాల మధ్యలో కూర్చుని వాటితో చెలగాటమాడితే? సరిగ్గా అలాంటి భయంకరమైన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. మృత్యువుతో చెలగాటమాడుతున్న ఈ వ్యక్తి ధైర్యం చూసి నెటిజన్లు ఆశ్చర్యంతో నోరెళ్లబెడుతున్నారు.

భయం లేకుండా పాముల మధ్య హాయిగా..!

ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న ఈ 39 సెకన్ల వీడియోలో ఒక వ్యక్తి మట్టి రోడ్డు ఓ బస్తాను తీసుకుని వచ్చిన వ్యక్తి హాయిగా పద్మాసనం వేసుకుని కూర్చుని కనిపిస్తాడు. అక్కడ కూర్చున్న తర్వాత బస్తాను ఓపెన్ చేసి రోడ్డుపై చెత్త పారేసినట్లుగా వందలాది పాములను అతని ముందు పడేసుకుంటాడు. అతని చుట్టూ, కాళ్ల పైన, చేతుల వద్ద భారీ ఎత్తున విషపూరితమైన నాగుపాములు పాకుతుంటాయి. ఆ సర్పాలు అతని చుట్టూ పాకుతూ, పడగలు విప్పుతున్నప్పటికీ, అతడు కొంచెం కూడా భయపడకుండా ఎంతో ప్రశాంతంగా వాటిని పట్టుకుంటూ సరదాగా గడుపుతున్నాడు. ఏమాత్రం పొరపాటు జరిగినా ప్రాణాలు క్షణాల్లో గాలిలో కలిసిపోతాయని తెలిసి కూడా అతడు ప్రదర్శించిన ధైర్యం అందరినీ షాక్‌కు గురిచేస్తోంది.

నెటిజన్ల సరదా కామెంట్లు..

ఈ ఉత్కంఠభరిత దృశ్యాన్ని చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఈ వీడియోను షేర్ చేసిన ఒక యూజర్ “ఈ సోదరుడికి రోజూ యమరాజుతోనే సావాసం ఉన్నట్లుంది” అని హిందీలో ఆసక్తికర వ్యాఖ్యను జోడించారు. విషసర్పాల కాటుకు ఏమాత్రం భయపడకుండా మృత్యుదేవతతో సరసాలు ఆడుతున్న ఈ వ్యక్తి ధైర్యాన్ని చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూస్తుంటే అతనికి పాములను అదుపు చేసే ఆధ్యాత్మిక శక్తులు లేదా అసాధారణమైన నైపుణ్యం ఉండి ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

సోషల్ మీడియాను ఊపేస్తున్న వీడియో..

ఈ వీడియో తక్కువ సమయంలోనే వేలాది వ్యూస్, లైకులు, కామెంట్లతో వైరల్‌గా మారింది. పాముల కదలికలు, వాటి మధ్య ఆ వ్యక్తి ప్రవర్తించిన తీరుపై జనాలు విపరీతమైన చర్చలు జరుపుతున్నారు. కొంతమంది అతడి ప్రతిభను మెచ్చుకుంటుంటే, మరికొందరు మాత్రం ఇలాంటి ప్రమాదకరమైన విన్యాసాలు చేయడం ప్రాణాలకే ముప్పు అని హెచ్చరిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us