Viral Video: ప్లాస్టిక్‌ డబ్బాలో ఇరుక్కుపోయిన సింహం ముఖం.. బయట పడలేక మల్లగుల్లాలు.. చివరకు ఏమైందంటే..

ఇటీవల జంతువులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి. అందులో సింహాలు, పులులు, ఏనుగులకు సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయి.

Viral Video: ప్లాస్టిక్‌ డబ్బాలో ఇరుక్కుపోయిన సింహం ముఖం.. బయట పడలేక మల్లగుల్లాలు.. చివరకు ఏమైందంటే..

Edited By:

Updated on: Apr 19, 2022 | 9:09 AM

ఇటీవల జంతువులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి. అందులో సింహాలు, పులులు, ఏనుగులకు సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయి. అలా ఒక సింహాల గుంపుకు చెందిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇందులో ఒక సింహం ముఖం ఒక పెద్ద ప్లాస్టిక్ డ్రమ్ము రంధ్రంలో ఇరుక్కుపోతుంది దాని నుంచి బయటపడేందుకు అది నానా తిప్పలు పడుతుంది. ఆతర్వాత కొద్ది సేపటికి ఆ సింహం చుట్టూ మరో రెండు సింహాలు వచ్చి చేరుతాయి. ఆ సింహం ముఖాన్ని ప్లాస్టిక్ డబ్బా నుంచి బయటకు తీసేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తాయి. అయితే ఎంత ప్రయత్నించినా సింహం ముఖం ఆ ప్లాస్టిక్‌ డబ్బాలోంచి బయటకు రాదు.

ఇంతలో ఆ రెండు సింహాలకు ఒక మాంసం ముక్క లభిస్తుంది. దానిని చూసిన రెండు సింహాలు డబ్బాలో ముఖం ఇరుక్కుపోయిన సింహాన్ని వదిలేసి అక్కడి నుంచి జారుకుంటాయి. ఇక డబ్బాలో ఇరుక్కుపోయిన సింహం కాసేపు అటూ ఇటూ దొర్లుతుంది. డబ్బా నుంచి బయటపడేందుకు తన ప్రయత్నాలు చేస్తుంది. చివరకు విసుగు చెంది..డబ్బాతోనే అక్కడ్నించి పరుగులు తీస్తుంది. వీడియో చూస్తుంటే ఇదంతా ఒక జూలో జరిగినట్లు తెలుస్తోంది. ఫన్నీ వీడియో అనిపించినప్పటికీ జంతు ప్రేమికులు మాత్రం ఈ వీడియోపై మండిపడుతున్నారు. మూగ జంతువులను ఇలా ఇబ్బంది పెట్టడం సరికాదు. సింహం ముఖం డబ్బాలో ఎలా ఇరుక్కుంది? కనీసం దానిని రక్షించే ప్రయత్నం చేయండి’ అంటూ జంతు ప్రేమికులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Also Read: Delhi Violence: కాల్పులు జ‌రిపిన‌ సోనూ చిక్నా అరెస్ట్.. ఢిల్లీ అల్లర్ల కేసులో చురుగ్గా పోలీసుల దర్యాప్తు..

Delhi Violence: కాల్పులు జ‌రిపిన‌ సోనూ చిక్నా అరెస్ట్.. ఢిల్లీ అల్లర్ల కేసులో చురుగ్గా పోలీసుల దర్యాప్తు..

Hyderabad: చారిత్రక కట్టడాలు భవిష్యత్తు తరాల వారికి అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి

Loading...
Unable to load recommendations.
Follow Us