Viral Video: 8వ అంతస్తులో కిటికీని పట్టుకుని వేలాడుతున్న చిన్నారి.. కాపాడిన వ్యక్తి.. వీడియో వైరల్

కిటికీ దగ్గర ఆడుతూ ఆడుతూ ప్రమాదవశాత్తు వెనక్కి జారిపడిపోయింది. ఈ క్రమంలో ఆ చిన్నారి.. కిటికీ గ్రిల్‌ను గట్టిగా పట్టుకొని వేళాడుతూ ఉంది.

Viral Video: 8వ అంతస్తులో కిటికీని పట్టుకుని వేలాడుతున్న చిన్నారి.. కాపాడిన వ్యక్తి.. వీడియో వైరల్
Kazakhstan Man

Updated on: May 14, 2022 | 8:07 PM

Viral Video: అది ఎనిమిది అంతస్తుల భవనం. తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నారో లేదో తెలియదు కానీ ఓ 3ఏళ్ల చిన్నారి ప్రాణాల మీదకు తెచ్చుకుంది. కిటికీ దగ్గర ఆడుతూ ఆడుతూ ప్రమాదవశాత్తు వెనక్కి జారిపడిపోయింది. ఈ క్రమంలో ఆ చిన్నారి.. కిటికీ గ్రిల్‌ను గట్టిగా పట్టుకొని వేళాడుతూ ఉంది. ఈ దృశ్యాన్ని చూసి స్థానికులు షాకయ్యారు. ‘అయ్యో పాపం’.. అంటూ హడావుడి చేశారే కానీ ఏ ఒక్కరూ ఆ చిన్నారిని రక్షించేందుకు ప్రయత్నించలేదు.

అదే సమయంలో స్నేహితుడితో కలసి అటుగా వెళ్తున్న సబిత్.. ఆ చిన్నారిని చూశాడు. మరో ఆలోచన చేయకుండా చిట్టితల్లిని రక్షించాలని రంగంలోకి దిగాడు. ఏడవ ఫ్లోర్‌కు వెళ్లి ఎటువంటి రక్షణ పరికరాలు లేకుండానే స్నేహితుడి సహాయంతో చిన్నారిని కాపాడాడు. ఈ ఘటన కజకిస్తాన్‌ రాజధానిలో చోటు చేసుకుంది.. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. సబిత్ చేసిన పని స్థానిక ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. Nur-Sultan సిటీ డిప్యూటీ ఎనర్జీ మినిస్టర్ సబిత్‌ను అభినందించారు. ఈ సందర్భంగా సబిత్ మాట్లాడుతూ ఆనందం వ్యక్తం చేశారు. ఎనిమిదవ అంతస్తులో పాప వేలాడుతూ కనిపించినపుడు తనను కాపాడాలనే ఒకే ఒక్క ఆలోచనతో ముందుకు వెళ్లినట్టు చెప్పారు. కాగా.. సబిత్‌కు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us