Viral Video: ఈ జామపండ్లు అమ్మే వ్యక్తి పాట ఫేమస్‌.. మరో భుబన్ బద్యాకర్ అవుతాడా ఏంది..!

Viral Video: సోషల్‌మీడియాలో ఎప్పుడు ఏ వీడియో వైరల్‌ అవుతుందో ఎవ్వరూ చెప్పలేరు. ఇటీవల ‘కచ్చా బాదం’ సాంగ్‌ తెగ ట్రెండ్ అయ్యింది. ఈ పాటకి సాధారణ వ్యక్తుల

Viral Video: ఈ జామపండ్లు అమ్మే వ్యక్తి పాట ఫేమస్‌.. మరో భుబన్ బద్యాకర్ అవుతాడా ఏంది..!
Guava Seller Song

Updated on: Mar 15, 2022 | 5:54 AM

Viral Video: సోషల్‌మీడియాలో ఎప్పుడు ఏ వీడియో వైరల్‌ అవుతుందో ఎవ్వరూ చెప్పలేరు. ఇటీవల ‘కచ్చా బాదం’ సాంగ్‌ తెగ ట్రెండ్ అయ్యింది. ఈ పాటకి సాధారణ వ్యక్తుల నుంచి సెలబ్రిటీల వరకు చాలా వీడియోలను రూపొందించారు. ‘కచ్చా బాదం’ సాంగ్‌ ఫేమస్‌ కావడంతో వేరుశెనగలు అమ్మే భుబన్ బద్యాకర్ భవిష్యత్‌ ఒక్క రాత్రిలో మారిపోయింది. ఇప్పుడు అదే విధంగా జామపండు అమ్మే వ్యక్తి పాట కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వ్యక్తి జామపండు కట్‌ చేస్తూ మధురమైన స్వరంతో పాడుతున్నాడు. అతడు పాటని హమ్ చేసిన తీరు సోషల్ మీడియాలో మరో నెక్స్ట్ హిట్ ట్రెండ్ అవుతుందనిపిస్తోంది. వీడియో చూసిన జనాలు చాలా రియాక్షన్స్ ఇస్తున్నారు. జామపండును విక్రయించే ఈ శైలి కచ్చాబాదం సాంగ్‌ని పోలి ఉందని చెబుతున్నారు. దీని కారణంగా చాలా మంది ప్రజలు భుబన్ బద్యాకర్‌ను గుర్తు చేసుకుంటున్నారు.

వైరల్‌ అవుతున్న ఈ వీడియలో జామపండ్లు అమ్మే వ్యక్తి జామకాయను కోసి అందులో ఉప్పు రుద్దుడం వీడియోలో చూడవచ్చు. అదే సమయంలో అతడు సరదాగా ఓ పాట హమ్‌ చేస్తాడు. అది వినడానికి చాలా గమ్మత్తుగా ఉంటుంది. అతడు పాడిన తీరు అద్భుతంగా ఉండటం గమనించవచ్చు. చాలా మంది నెటిజన్లు ఈ వీడియోపై తమ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు. ఒక నెటిజన్ ‘రాబోయే సమయం ఇప్పుడు వారిదేనని అనిపిస్తోంది’ అని రాశాడు. మరొక నెటిజన్ ‘ఇప్పుడు వారి అదృష్టం కూడా అతి త్వరలో మారబోతున్నట్లు కనిపిస్తోంది’ అన్నాడు. ఈ వీడియోను చూసిన తర్వాత ప్రజలు నిరంతరం కామెంట్లు చేస్తూనే ఉన్నారు. ఇప్పటివరకు లక్ష మందికి పైగా ఈ వీడియోని వీక్షించారు. మీరు కూడా ఈ వీడియోని చూసినట్లయితే మీ కామెంట్ తెలియజేయండి.

ఈ పథకంలో నెల నెలా రూ.10,000 డిపాజిట్‌ చేయండి.. సులభంగా రూ.16 లక్షలు పొందండి..!

Women Health: మహిళలు ఇవి చేస్తే గుండె జబ్బుల బారిన పడరు.. ఎందుకంటే..?

Minister Perni Nani Comments: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి పేర్ని నాని ఫైర్..