పెళ్లికి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు పెళ్ళికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. అందులో అందమైన పెళ్లి మండపం.. పెళ్ళికి హాజరమైన ఆహుతుల మధ్య సంప్రదాయ దుస్తుల్లో వధూవరులు చేతిలో వరమాలతో ఉన్నారు. అయితే ఈ పెళ్లి వేడుకలో సడెన్ గా ఓ యువతి ఎంట్రీ ఇచ్చింది. ఝాన్సీరాణిగా ఆ వరుడిని తన్నిన చోట తన్నకుండా తన్ని ఓ రేంజ్ లో దాడి చేసింది. సడెన్ గా కళ్యాణ మండపంలో జరిగిన ఈ దాడి చూసి కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు.
ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న వీడియోలో వధూవరులు తమ కుటుంబ సభ్యులతో కలిసి పెళ్లి వేదికపై నిలబడి ఉన్నారు. నవ వధువు, వరులు వర మాలను పట్టుకున్నారు. ముందుగా వధువు వరుడి మెడలో వర మాల వేసింది. తర్వాత వధువు మెడలో వరుడు దండ వేస్తుండగా అనుకోకుండా ఓ యువతి వేదికపైకి వచ్చింది. యువతి ఒక్కసారిగా వరుడిని తన్నడం ప్రారంభించింది. కొంతదూరంలో పడిపోయిన వరుడిని ఆ యువతి వెంటనే లేపి మళ్లీ విచక్షణారహితంగా దాడి చేసింది.
ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి
ఈ ఘటనను చూసిన బంధువులు, స్నేహితులు షాక్‌కు గురయ్యారు. కళ్ల ముందే తనకు కాబోయే భర్తపై దాడి చేయడం చూసి షాక్‌కు గురైన వధువు.. ఆ యువతితో వాగ్వాదానికి దిగింది. అప్పుడు ఆ యువతి నవ వధువుతో తీవ్ర వాగ్వాదానికి దిగడమే కాదు.. పెళ్లి కొడుకు తనని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని.. తనకు తెలియకుండా దొంగ చాటుగా ఈ పెళ్లి చేసుకున్తుంటున్నాడని చెప్పింది. సోనుకుమార్‌గిరి396 ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన వీడియో ఇప్పటికే 20 లక్షలకు పైగా వ్యూస్ ని సొంతం చేసుకుంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..