
సెప్టెంబర్ 16న జరిగిన ఒక విషాద ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియలో వైరల్‌గా మారింది. ఎయిర్ షో కోసం రిహార్సల్ చేస్తున్న సమయంలో రెండు చైనీస్ ఎగిరే కార్లు గాలిలో ఒకదానికొకటి ఢీకొన్నాయి. చాంగ్‌చున్ ఎయిర్ షో 2025 సెప్టెంబర్ 19న చైనాలో నిర్వహించనున్నారు. ప్రదర్శనలో ప్రదర్శించాల్సిన రెండు ఎగిరే కార్లు రిహార్సల్ చేస్తున్నప్పుడు గాలిలో ఢీకొన్నాయి. రెండు కార్లు చైనీస్ ఎలక్ట్రిక్ వెహికల్ తయారీదారు Xpeng Inc.కి చెందినవిగా తెలుస్తోంది.
మంగళవారం రిహార్సల్స్ చేస్తున్న సమయంలో రెండు ఎలక్ట్రిక్ ఎగిరే కార్లు ఒకటి టేకాఫ్, మరొకటి ల్యాండింగ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. నేలపై ఢీకొన్న తర్వాత ఒక వాహనం మంటల్లో చిక్కుకుంది.
长春航展两架飞行汽车在空中相撞坠落起火!9月16日,长春航展预演结束后,广东汇天通航参与双机编队演练期间。两架eVTOL(电动垂直起降飞行器)在空中相撞后坠机,在地面燃起大火… pic.twitter.com/pYWqziAHUD
— 希望之聲 – 中國時局 (@SoundOfHope_SOH) September 17, 2025
రెండు ఎగిరే కార్లు గాలిలో ఢీకొని క్రాష్ అయ్యాయి, చాంగ్‌చున్ ఎయిర్‌షోలో మంటలు చెలరేగాయి! సెప్టెంబర్ 16న, చాంగ్‌చున్ ఎయిర్‌షో రిహార్సల్ ముగిసిన తర్వాత, గ్వాంగ్‌డాంగ్ హుటియన్ జనరల్ ఏవియేషన్. రెండు eVTOLలు గాలిలో ఢీకొని ఆపై క్రాష్ అయ్యాయి, నేలపై పెద్ద మంటలు చెలరేగాయి. అని సోషల్ మీడియా పోస్టులో రాసుకొచ్చారు.
చాంగ్‌చున్ ఎయిర్ షో 2025 సెప్టెంబర్ 19న ప్రారంభమవుతుంది. అయితే, సెప్టెంబర్ 16న రెండు Xpeng Aeroht eVTOLలు రిహార్సల్స్‌లో నిమగ్నమై ఉండగా ఢీకొన్నాయి. తగినంత వ్యవధి లేకపోవడంతో వారు ఫార్మేషన్ ఫ్లైట్‌ను ప్రాక్టీస్ చేస్తున్నారని కంపెనీ తెలిపింది.