Viral Video: ఎంతో ప్రేమగా కొడుకు కోసమని బొమ్మ తుపాకీ కొన్నాడు… ఆ తర్వాత చుక్కలు చూపించిన మెట్రోరైల్ వీడియో వైరల్‌

మెట్రో రైల్లో పలు రకాల సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంటాయి. ముఖ్యంగా రీల్స్‌ రాయుళ్లు మెట్రోను వాడుకున్నంతగా మరెవరూ వాడుకోరు. మెట్రో రైల్లో రకరకాలుగా డ్యాన్స్‌ చేస్తూ, ప్రాంక్‌లు చేసే వీడియోలు నెట్టింట అప్‌లోడ్‌ చేస్తుంటారు. అయితే మెట్రో రైళ్లలో కొన్ని రకాల వస్తువులు...

Viral Video: ఎంతో ప్రేమగా కొడుకు కోసమని బొమ్మ తుపాకీ కొన్నాడు... ఆ తర్వాత చుక్కలు చూపించిన మెట్రోరైల్ వీడియో వైరల్‌
Dont Travel With Toy Gun In

Updated on: Oct 06, 2025 | 7:28 PM

మెట్రో రైల్లో పలు రకాల సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంటాయి. ముఖ్యంగా రీల్స్‌ రాయుళ్లు మెట్రోను వాడుకున్నంతగా మరెవరూ వాడుకోరు. మెట్రో రైల్లో రకరకాలుగా డ్యాన్స్‌ చేస్తూ, ప్రాంక్‌లు చేసే వీడియోలు నెట్టింట అప్‌లోడ్‌ చేస్తుంటారు. అయితే మెట్రో రైళ్లలో కొన్ని రకాల వస్తువులు తీసుకెళ్లడం నిషధం. తాజాగా అందుకు భిన్నంగా ఓ వీడియో వైల్‌ అవుతోంది. దసరా, దీపావళి పండగ సందర్భంగా పిల్లల కోసం బొమ్మలు కూడా పెద్ద సంఖ్యలో అమ్ముడవుతాయి. వాటిలో బొమ్మ తుపాకులు కూడా ఉన్నాయి. ఈ బొమ్మలను బస్సులు, రైళ్లలో సులభంగా తీసుకెళ్లవచ్చు. అయితే, ఢిల్లీ మెట్రోలో వాటిని తీసుకెళ్లడం గురించి కూడా నిబంధనలు వర్తిస్తాయి. ఒక వ్యక్తి తన కొడుకు కోసం కొనుగోలు చేసిన బొమ్మ తుపాకీని మెట్రోలోకి తీసుకెళ్లినప్పుడు సిబ్బంది అతన్ని అడ్డుకుంటారు. ప్రయాణీకుడు పదే పదే అభ్యర్థించినప్పటికీ బొమ్మ తుపాకీని మెట్రోలోకి తీసుకెళ్లడానికి అనుమతించరు. ఆ ప్రయాణీకుడు తర్వాత వీడియో చిత్రీకరిస్తూ ఎందుకు అనుమతించరు? అని ప్రశ్నించాడు. వినియోగదారు DMRCని ట్యాగ్ చేసి, ఈ విషయంపై ఢిల్లీ మెట్రో స్పందించాలని కోరాడు.

వీడియోలో ఆ వ్యక్తి బొమ్మ తుపాకీని చూపిస్తూ నేను ఈ ప్లాస్టిక్ బొమ్మను నా బిడ్డ కోసం కొన్నాను. ఇది చూడు అని అంటున్నాడు. ఆ తర్వాత అతను కెమెరాను అధికారుల వైపు తిప్పి, ఢిల్లీ మెట్రో రైలులో దీన్ని తీసుకెళ్లడానికి ఎందుకు అనుమతి లేదు?” అని ప్రశ్నిస్తాడు. దాదాపు 24 సెకన్ల వీడియో ఫుటేజ్‌లో అతను అదే అడుగుతున్నట్లు కనిపిస్తుంది.

వీడియో చూడండి:

అయితే ఢిల్లీ మెట్రోలో భద్రతా ప్రమాణాల్లో భాగంగా బొమ్మ తుపాకులను కూడా తీసుకెళ్లడం నిషేధించారు. ఆయుధాలను అనుకరించే వస్తువులను తీసుకెళ్లడం కూడా మెట్రో నిషేధించింది.

ఈ వీడియోకు @OfficialDMRC X లో స్పందించింది. “మీ ఆందోళనను మేము అర్థం చేసుకున్నాము. అయితే, DMRC భద్రతా మార్గదర్శకాల ప్రకారం, ప్రయాణీకుల భద్రత దృష్ట్యా ఆయుధాల ప్రతిరూపాలతో ఉండే వస్తువులను మెట్రో ప్రాంగణంలోకి అనుమతించబడదు అని రాస్తూ రిప్లై ఇచ్చింది.

Follow Us