Viral Video: కుంటుకుంటూ స్వయంగా వైద్యుడి దగ్గరకు వెళ్లిన పిల్లి… దానికన్నీ తెలుసు.. మనుషులైతే బాబాల దగ్గరికి వెళ్లేవారంటున్న నెటిజన్స్‌

పిల్లులు సాదు జంతువులు అని అందరికీ తెలిసిందే. అవి ఒక్కోసారి ఇంటిలో చేసే అల్లరి నవ్వు తెప్పిస్తుంటాయి. ఒక్కోసారి మనుషులు సైతం ఆశ్చర్యపోయేలా చేస్తుంటాయి. పిల్లులకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో అనేకం ఆకట్టుకుంటాయి. అలాంటి వీడియోనే ఒకటి ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. సాధారణంగా...

Viral Video: కుంటుకుంటూ స్వయంగా వైద్యుడి దగ్గరకు వెళ్లిన పిల్లి... దానికన్నీ తెలుసు.. మనుషులైతే బాబాల దగ్గరికి వెళ్లేవారంటున్న నెటిజన్స్‌
Cat Went To The Doctor

Updated on: Oct 07, 2025 | 4:59 PM

పిల్లులు సాదు జంతువులు అని అందరికీ తెలిసిందే. అవి ఒక్కోసారి ఇంటిలో చేసే అల్లరి నవ్వు తెప్పిస్తుంటాయి. ఒక్కోసారి మనుషులు సైతం ఆశ్చర్యపోయేలా చేస్తుంటాయి. పిల్లులకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో అనేకం ఆకట్టుకుంటాయి. అలాంటి వీడియోనే ఒకటి ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. సాధారణంగా మనుషులు గాయపడినప్పుడు లేదా అనారోగ్యానికి గురైనప్పుడు ఆస్పత్రికి వెళతారు. కానీ పిల్లి స్వయంగా వైద్యుడి దగ్గరికి వెళ్లడం ఎప్పుడైనా చూశారా? కానీ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోన్న వీడియోలో మాత్రం ఓ పిల్లి స్వయంగా కుంటుకుంటూ ఆస్పత్రికి వెళ్లింది. గాయపడిన పిల్లి మనుషల మాదిరిగానే స్వయంగా వైద్యుడి వద్దకు వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఈ వీడియోలో ఒక అందమైన, తెలుపు-బూడిద రంగు పిల్లి నెమ్మదిగా ఆసుపత్రిలోకి నడుచుకుంటూ వెళుతుండటం మీరు చూడవచ్చు. మొదట్లో పిల్లి లోపలికి వెళుతుండటం కనిపిస్తుంది. కొంత ముందుకు వెళ్లిన తర్వాత పిల్లి కాలికి గాయమైందని తెలుస్తుంది. అందుకే అది కుంటుతూ నేరుగా సహాయం కోసం వైద్యుడి వద్దకు వెళ్ళింది. అక్కడికి చేరుకున్న తర్వాత, అది కుర్చీపై హాయిగా పడుకుని, వైద్యుడిని పరీక్షించడానికి అనుమతించింది. డాక్టర్ దాని కాలుకు మందు రాసి కట్టు కట్టాడు. ఈ సంఘటన టర్కీలో జరిగినట్లు తెలుస్తోందని తెలుస్తోంది.

వీడియో చూడండి:

సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో ప్రజల హృదయాలను దోచుకుంది. ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో @Ansari5k అనే యూజర్‌నేమ్‌తో షేర్ చేశారు, “టర్కీలో ఒక తెలివైన గాయపడిన పిల్లి స్వయంగా చికిత్స పొందడానికి ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్నట్లు నటిస్తూ కూర్చుంది అంటూ క్యాప్షన్‌ ఇచ్చాడు.

ఈ ఒక నిమిషం నిడివి గల ఈ వీడియోను వేలాది మంది వీక్షించారు. “జంతువులు అనారోగ్యంతో ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్లాలో కూడా తెలుసు, కానీ మానవులకు తెలియదు సగం మంది బాబా వద్దకు వెళతారు” అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు.