Watch: బాత్రూంలో స్నానం చేస్తున్న మహిళ.. సడెన్‌గా ఆమెనే చూస్తున్న రెండు కళ్లు..! ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే..
వీడియోకు సంబంధించిన మహిళ చెప్పిన దాని ప్రకారం, పట్టణ బిజీలైఫ్ నుంచి దూరంగా ప్రశాంతమైన జీవనం కోసం నగరం నుండి దూరంగా వెళ్లిపోయింది. కానీ, ఒంటరిగా ఉండటం ఎంత కష్టమో ఆమె ఊహించలేదు. ఇంట్లో ఒంటరిగా ఉంటే స్నానం కూడా చేయలేరని ఆమెకు తెలియదు. ఎందుకంటే..ఫామ్ హౌజ్‌లో ఆమెతో పాటు

సోషల్ మీడియాలో నిత్యం అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. ప్రజలు తమకు ఎదురైన అనుభవాలను కూడా ఇక్కడ షేర్ చేస్తుంటారు. ఒక మహిళ సోషల్ మీడియాలో ఒక ప్రత్యేకమైన సమస్యను పంచుకుంది. ఆమె తన కుటుంబంతో కలిసి నగరానికి దూరంగా ఉన్న ఒక ఫామ్‌హౌస్‌లో నివసిస్తుంది. అక్కడ నివసించే మేకలు ఆమెను వెంబడించడం మానేయవు. ఆమె స్నానం చేస్తున్నప్పుడు అవి ఆమెతో పాటు బాత్రూంలోకి కూడా వస్తాయి.
నగర హడావిడికి దూరంగా ఫామ్‌హౌస్ జీవితం కావాలని కోరుకునే వారికి ఇలాంటి అనుభవాలు కూడా తప్పవు. ఫామ్‌హౌస్ లైఫ్ ఎలా ఉంటుందో ఒక చిన్న ఉదాహరణగా కనిపించే ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అమెరికాలోని టెక్సాస్‌లో నివసిస్తున్న ఒక మహిళ ఇన్‌స్టాగ్రామ్‌లో తనకు ఎదురైన అనుభవాన్ని ఈ వీడియో ద్వారా షేర్ చేశారు. నగరానికి దూరంగా ఏకాంతాన్ని ఆస్వాదించవచ్చని ప్రజలు అనుకుంటారు. కానీ, ఈ మహిళ ఒక్క నిమిషం కూడా ఒంటరిగా ఉండటం సాధ్యం కాదని చెబుతోంది. ఇకపోతే, ఈ వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..
వీడియోకు సంబంధించిన మహిళ చెప్పిన దాని ప్రకారం, పట్టణ బిజీలైఫ్ నుంచి దూరంగా ప్రశాంతమైన జీవనం కోసం నగరం నుండి దూరంగా వెళ్లిపోయింది. కానీ, ఒంటరిగా ఉండటం ఎంత కష్టమో ఆమె ఊహించలేదు. ఇంట్లో ఒంటరిగా ఉంటే స్నానం కూడా చేయలేరని ఆమెకు తెలియదు. ఎందుకంటే..ఫామ్ హౌజ్‌లో ఆమెతో పాటు కొన్ని మేకలు కూడా ఉన్నాయి. అవి ఆమెను ఒక్క క్షణం కూడా విడిచిపెట్టి ఉండటం లేదు. ఈ క్రమంలోనే ఆమె స్నానం చేస్తున్నప్పుడు అవి బాత్రూంలోకి కూడా చొరబడి ఆమెను చూస్తాయి. ఆ మహిళ దీనిని వీడియో తీసి షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
నగరంలోని హడావిడి నుండి దూరంగా ఉండటానికి అలెగ్జాండర్ హంటర్ అనే మహిళ తన కుటుంబంతో కలిసి ఒక ఫామ్‌హౌస్‌లో నివసిస్తుంది. తనకు ఎదురైన అనుభవాన్ని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తన ఫామ్‌హౌస్ జీవితాన్ని నెటిజన్లతో పంచుకుంది. అందులో ఆమె బాత్రూంలో స్నానం చేస్తున్న దృశ్యం కనిపించింది. అప్పుడు రెండు మేకల మెరిసే కళ్ళు తలుపు నుండి తొంగి చూడటం ప్రారంభించాయి. దాంతో ఆ మహిళ ఒక్కసారిగా గట్టిగా కేకలు వేసింది. కానీ మేకలు లోపలికి ప్రవేశించి షవర్ నీటిలో దూకి, నీరు చల్లుతూ, జారుతూ అల్లరి ప్రారంభించాయి. ఈ వీడియోకి క్యాప్షన్‌గా ఆమె ఇలా రాసింది..వీళ్లంతా పసిపిల్లల లాంటివారు.. అంటే ఈ మేక పిల్లలు నాకు పిల్లల్లాగే ఉన్నారు అని రాసింది. ఈ వీడియో లక్షలాది మందిని నవ్వించింది. కానీ చాలా మంది ఆ మహిళ సమస్యను కూడా అర్థం చేసుకున్నారు.
వీడియో ఇక్కడ చూడండి…
View this post on Instagram
ఆమె చెప్పిన మాటల మేరకు.. మేకలు చాలా ఆసక్తిగా ఉంటాయి. అవి ప్రతిచోటా ఆమెను అనుసరిస్తాయి. ఆమె స్నానం చేయడానికి వెళ్ళినప్పుడల్లా అవన్నీ అక్కడికి కూడా వస్తాయి. ఈ వీడియోను ఇప్పటివరకు లక్షలాది సార్లు వీక్షించారు. మేకలు సామాజిక జంతువులు అని వ్యవసాయ నిపుణులు అంటున్నారు. అవి వాటి యజమానిని తమ తల్లిగా భావిస్తాయి. అందుకే ఆ మహిళను ఒంటరిగా వదిలిపెట్టవు. జంతు ప్రవర్తన నిపుణురాలు డాక్టర్ జెన్నిఫర్ స్మిత్ ప్రకారం, మేకలు ఉత్సుకతతో నిండి ఉంటాయి. అందువల్ల, ఏదైనా కొత్త విషయం చూసిన వెంటనే అవి దాని దగ్గరికి వెళ్తాయి.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




