Viral Video: భాంగ్రా డ్సాన్స్‌తో దుమ్ములేపిన వధువు.. కరెన్సీ నోట్ల వర్షం కురిపించేశారు..!

Viral Video: పెళ్లి.. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే అందమైన వేడుక. ఆ వేడుకను అంగరంగవైభవంగా

Viral Video: భాంగ్రా డ్సాన్స్‌తో దుమ్ములేపిన వధువు.. కరెన్సీ నోట్ల వర్షం కురిపించేశారు..!
Bride

Updated on: Feb 26, 2022 | 4:51 PM

Viral Video: పెళ్లి.. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే అందమైన వేడుక. ఆ వేడుకను అంగరంగవైభవంగా చేసుకోవాలని ప్రతీ యువతి, యువకుడు కల కంటారు. తమ వివాహాన్ని తమ అభిష్టానికి అనుగుణంగా జరుపుకుంటారు. సాధారణంగానే పెళ్లంటేనే హడావుడి. పని హడావిడి ఓ వైపు.. సెలబ్రేషన్స్, ఎంజాయ్‌మెంట్స్ మరోవైపు. సంగీత్, డ్యాన్సులు, ఇతర ప్రోగ్రామ్స్‌తో మొత్తానికి వివాహ వేడుకను దుమ్మురేపుతారు. ప్రస్తుత కాలంలో ఈ ట్రెండ్ మరింత పెరిగింది. వధు వరులు డ్యాన్సులతో ధుమ్ము రేపుతున్నారు. తాజాగా ఓ వధువుకు సంబంధించిన వీడియో కూడా తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో లెహెంగా ధరించిన పెళ్లి కూతురు.. భాంగ్రా డ్యాన్స్‌తో దుమ్ము రేపింది. పెళ్లి కుమారుడిని మించి డ్యాన్స్ చేసి ఔరా అనిపించింది. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేశారు.

ఈ వీడియోలో దేవకన్యలా ఉన్న వధువు ఆయుషి.. వరుడితో కలిసి భాంగ్రా డ్యాన్స్ చేసింది. గోల్డ్ కలర్ లెహంగాలో మెరిపోతూ.. నువ్వా నేనా అన్నట్లుగా వరుడితో పోటీ పడుతూ దుమ్ము రేపే స్టెప్పులేసింది. ఆయుషి డ్యాన్స్‌కి ఫిదా అయిపోయిన వరుడు తన చేతిలో కరెన్సీ నోట్లను పట్టుకుని ఆమెపై చల్లుతో చిందులేశాడు. ముఖంలో చిరునవ్వు, మ్యూజిక్ తగ్గట్లు హావభావాలతో అందరినీ ఆకట్టుకుంది ఆయుషి. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్‌గా మారింది. వధువు డ్యాన్స్‌కు నెటిజన్లంతా ఫిదా అయిపోతున్నారు. ఈ వీడియోను ఇప్పటి వరకు 25 లక్షల మందికి పైగా వీక్షించగా.. లక్షలాది లైక్స్ వచ్చాయి.

Also read:

Wife Caught: ప్రియురాలితో ఎంజాయ్ చేస్తున్న భర్త.. సడెన్‌గా వచ్చిన భార్య.. ఆ తరువాత ఏం జరిగిందంటే..

Russia Ukraine Conflict: అభినవ బాహుబలి వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ.. ఇవి కదా వీరుడి లక్షణాలంటే..!

ACE Engineering Academy: బ్యాంకింగ్ పోటీ పరీక్షలకు శిక్షణ.. ఏసిఈ ఇంజినీరింగ్ అకాడమీ మరో ముందడుగు..

Loading...
Unable to load recommendations.
Follow Us