Viral Video: మృత్యువును ముద్దాడాలని ఎవరి మాత్రం కోరుకుంటారు చెప్పండి. కానీ, కొందరు తమ తొందరపాటు, ఆరాటం కారణంగా చావు ఎదురెళుతారు. అదృష్టం ఉంటే బ్రతికి బయటపడతారు. లేదంటే బకెట్ తన్నడం ఖాయం. తాజాగా ఇలాంటి షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన తొందరపాటు కారణంగా చావు అంచులదాకా వెళ్లి వచ్చాడు. ఇంకా చెప్పుకోవాలంటే.. మృత్యువుకు షేక్ హ్యాండ్ ఇచ్చి వచ్చాడనాలి. అవును, ఈ వీడియో చూసిన నెటిజన్లు ఓవైపు అతని తీరును తప్పుపడుతూనే.. మరోవైపు సింపతీ ప్రకటిస్తున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది? అంతలా ఏం జరిగింది? ఇప్పుడు చూద్దాం..
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో నాలుగైదు ట్రైన్ ట్రాక్స్ ఉన్నాయి. ఓ ట్రాక్‌పై రైలు వెళ్తూనే ఉంది. మరోవైపు గేట్ కీపర్ రైల్వే గేట్ క్లోజ్ చేశారు కూడా. కానీ, కొందరు గమ్యం చేరుకోవాలనే తొందరపాటో, మరే కారణమో గానీ.. ట్రాక్ దాటేందుకు అడ్డుగా ఉన్న గేటును సైతం దాటి ముందుకు వెళ్లారు కొందరు వాహనదారులు. అయితే, ఇంతలోనే మరో ట్రాక్ పై నుంచి ట్రైన్ దూసుకొచ్చింది. అది గమనించిన కొందరు వెంటనే వెనుదిరిగారు. మరో వ్యక్తి బైక్ మాత్రం అక్కడే చిక్కుకుపోయింది. అటు నుంచి దూసుకువస్తున్న బైక్.. ఇటు నుంచి బైక్ ఇరుక్కుపోవడంతో కన్ఫ్యూజ్ అయ్యాడతను. చివరకు ప్రాణాలతో బయటపడితే చాలురా బాబూ అనుకుని బైక్ విడిచి బయటకు దూకాడు. అతను అలా దూకడమే ఆలస్యం.. ట్రైన్ బైక్‌ను ఢీకొంటూ దూసుకెళ్లింది. ఈ ఘటన అంతా అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేయగా.. అదికాస్తా వైరల్ అవుతోంది. ఒల్లు గగుర్పాటుకు గురిచేసేలా ఉన్న ఈ వీడియో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. కాగా, ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా ప్రాంతంలో చోటు చేసుకుంది.
प्रकरण के संबंध में तत्काल रेलवे पुलिस बल द्वारा ट्रैन के नीचे फसी मोटरसाइकिल को निकाल कर ट्रेन को रवाना किया गया ।
— ETAWAH POLICE (@etawahpolice) August 29, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..