Viral Video: బిహార్‌లోని గయా జలపాతంలో చిక్కుకున్న పర్యాటకులు… ఊహించని వరద ప్రవాహంతో పర్యాటకుల ఆర్తనాదాలు

బిహార్‌లోని గయాజీలో కొండపై ఉన్న జలపాతం దగ్గర నీటి ప్రవాహం అనూహ్యంగా పెరిగింది. ఊహించని వరద ప్రవాహంతో పర్యాటకులు చిక్కుకుపోయారు. కొందరు చెట్లను పట్టుకుని కాపాడమంటూ ఆర్తనాదాలు చేశారు. మరికొందరు నీటి మధ్యలో కొండ రాళ్లపై చిక్కుకుపోయారు. గోపాల్‌గంజ్‌లోని ఆస్పత్రిలోకి వరద...

Viral Video: బిహార్‌లోని గయా జలపాతంలో చిక్కుకున్న పర్యాటకులు... ఊహించని వరద ప్రవాహంతో పర్యాటకుల ఆర్తనాదాలు
Gaya Waterfall Suddenly Flo

Updated on: Jun 30, 2025 | 5:23 PM

ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలను మరోసారి భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఉత్తరాఖండ్‌, బిహార్‌, ఝార్ఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌తోపాటు పశ్చిమబెంగాల్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, నదులు పొంగిపొర్లుతున్నాయి. ఉత్తరాఖండ్‌లోని పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడడంతో పలువురు మృతి చెందారు. బిహార్‌లోనూ భారీ వర్షాలు పడుతున్నాయి.

బిహార్‌లోని గయాజీలో కొండపై ఉన్న జలపాతం దగ్గర నీటి ప్రవాహం అనూహ్యంగా పెరిగింది. ఊహించని వరద ప్రవాహంతో పర్యాటకులు చిక్కుకుపోయారు. కొందరు చెట్లను పట్టుకుని కాపాడమంటూ ఆర్తనాదాలు చేశారు. మరికొందరు నీటి మధ్యలో కొండ రాళ్లపై చిక్కుకుపోయారు. గోపాల్‌గంజ్‌లోని ఆస్పత్రిలోకి వరద నీరు చేరడంతో రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

వీడయో చూడండి:

 

 

హిమాలచల్‌ ప్రదేశ్‌లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. రాజధాని సిమ్లాలో ఒక పాత ఐదంతస్థుల భవనం కూలిపోయింది. భవనంలో ఉన్నవాళ్లను ముందే ఖాళీ చేయించడంతో ముప్పు తప్పింది. మండిలో బియాస్‌ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. గత పది రోజుల్లో హిమాచల్‌ప్రదేశ్‌లో వర్షాలకు 20 మంది చనిపోయారు. మరికొంతమంది ఆచూకీ గల్లంతైంది.

ఝార్ఖండ్‌లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఝార్ఖండ్‌ తూర్పు సింగ్‌భమ్‌ జిల్లాలో శంకు నదిలో ఒక యువకుడు చిక్కుకుపోయాడు. ఒక చెట్టుపై చిక్కుకుపోయిన అతన్ని సమీప గ్రామస్థులు కాపాడారు.