Viral Video: కాశీ విశ్వనాథుడికి 21 క్వింటాళ్ల స్వీట్లతో నైవేద్యం… వీడియో చూస్తేనే కడుపు నిండిపోతుంది

ఉత్తర్​ప్రదేశ్ వారణాసిలో కాశీవిశ్వనాథుడు, అన్నపూర్ణ ఆలయాల్లో అన్నకూట్ మహాత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా ఆలయాల్లో ఎన్నడూ చూడనన్ని స్వీట్లు, లడ్డూలు, రుచికరమైన వంటకాలను నైవేద్యాలుగా సమర్పించారు. 21 క్వింటాళ్ల స్వీట్లను కాశీ విశ్వనాథుడికి నైవేద్యాన్ని సమర్పించారు. అనంతరం భక్తులకు...

Viral Video: కాశీ విశ్వనాథుడికి 21 క్వింటాళ్ల స్వీట్లతో నైవేద్యం... వీడియో చూస్తేనే కడుపు నిండిపోతుంది
Annakut At Varanasi

Updated on: Oct 22, 2025 | 8:59 PM

ఉత్తర్​ప్రదేశ్ వారణాసిలో కాశీవిశ్వనాథుడు, అన్నపూర్ణ ఆలయాల్లో అన్నకూట్ మహాత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా ఆలయాల్లో ఎన్నడూ చూడనన్ని స్వీట్లు, లడ్డూలు, రుచికరమైన వంటకాలను నైవేద్యాలుగా సమర్పించారు. 21 క్వింటాళ్ల స్వీట్లను కాశీ విశ్వనాథుడికి నైవేద్యాన్ని సమర్పించారు. అనంతరం భక్తులకు ఈ ప్రసాదాన్ని పంచారు.ఆలయాన్ని మొత్తం లడ్డూలతో అలకరించారు. ఆలయ ప్రాంగణం మొత్తాన్ని రంగుల పూలమాలలతో అలంకరించారు.

వీడియో చూడండి:

కాశీ విశ్వనాథ్ ధామ్​లో ప్రతి ఏటా కార్తీక మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి నాడు అన్నకూట్ పండుగను జరుపుకుంటారు. ఏటా దీపావళి తర్వాతి రోజున గోవర్ధన్ పూజ నాడు ఈ ఉత్సవాన్ని ఆలయ నిర్వాహకులు ఘనంగా నిర్వహిస్తారు. అన్నకూట్ అంటే సమృద్ధిగా ఉండే ఆహార ధాన్యాలు. ఈ పండుగ ప్రజల శ్రేయస్సు, భక్తికి ప్రతీక అని భావిస్తారు.

దీపావళి మరుసటి రోజే శివుడు కాశీకి వచ్చాడని భక్తుల నమ్మకం. శివుడికే అన్నపూర్ణాదేవీ భిక్ష వేశారని విశ్వసిస్తారు. అలాగే కాశీలో ప్రజలు ఎవరూ ఆకలితో ఉండకుండా అన్నపూర్ణ దేవి చూసుకుంటుందని భక్తుల విశ్వాసం. దీపావళి తర్వాత రోజున వారణాసిలో అన్నకూట్ పండగ నిర్వహించడం చాలా ఏళ్లుగా సంప్రదాయంగా వస్తోంది.