Video Viral: పులులు, ముసళ్ల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అలాగే పాముల వీడియోలు కూడా తెగ వైరల్ అవుతుంటాయి. ఇక బాంబే హైకోర్టులో ఓ పాము కలకలం సృష్టించింది. భారీ పామును చూసిన అక్కడున్నవారు కొంత ఆందోళనకు గురయ్యారు. బాంబే హైకోర్టు జడ్జి ఎన్‌ఆర్ బోర్కర్ ఛాంబర్‌లో శుక్రవారం ఉదయం పాము కనిపించింది. అయితే ఆ సమయంలో న్యాయమూర్తి అక్కడ లేరు. కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులు, జనాలు కూడా పెద్దగా లేరు. కరోనా కారణంగా కోర్టుకు ఎవ్వరు కూడా రావడం లేదు. ఇదే సమయంలో న్యాయమూర్తి ఛాంబర్‌లో ఓ పాము కనిపించింది. దానిని చూసిన వారు మొదటగా పోలీసులకు సమాచారం అందించాఉ. పోలీసులు అక్కడకు వెళ్లి సర్ప్‌మిత్ర అనే ఎన్‌జీవో సంస్థను సంప్రదించారు. ఆ సంస్థకు చెందిన వ్యక్తి కోర్టుకు వచ్చి ఆ పామును పట్టుకుని గోనె సంచిలో వేసుకున్నాడు. ఆ పాము 5 అడుగుల పొడవు ఉంది. ఆ పాము విషపూరితమైనది కాదని, దానిని అడవుల్లో వదిలిపెడతామని ఓ అధికారి తెలిపారు. అయితే న్యాయమూర్తి ఛాంబర్‌లో కనిపించిన ఈ పాము ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరరల్‌గా మారింది. పాము కోర్టులో కనిపించడంతో అక్కడున్నవారు అప్రమత్తమయ్యారు.
A snake found in the Bombay High Court judge’s chamber. pic.twitter.com/FYlpvVZ62W
— Meenu Thakur (@JournoMeenu) January 21, 2022
ఇవి కూడా చదవండి: