Video: కాలువలో చిక్కుకున్న షార్క్‌.. చూసిన 10 లక్షల మంది!

దక్షిణ కొరియాలోని బుసాన్ నగరంలో కాలువలో చిక్కుకుపోయిన షార్క్ ను చూసేందుకు 18 రోజుల్లో 10 లక్షల మంది తరలి వచ్చారు. దీంతో స్థానిక వ్యాపారాలు లాభపడుతున్నాయి. షార్క్‌ను సముద్రంలోకి పంపేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో స్థానిక మీడియా నిరంతరం దీనిపై వార్తలు ప్రసారం చేసింది. దీంతో ‘బుకాంగి’ సోషల్ మీడియాలో కూడా వైరల్‌గా మారింది.

Video: కాలువలో చిక్కుకున్న షార్క్‌.. చూసిన 10 లక్షల మంది!
Viral Trapped Shark In South Korea Brings Tourism To Busan

Updated on: Oct 07, 2026 | 8:28 PM

బుసాన్‌ నగరంలోని ఓ కెనాల్‌లో చిక్కుకున్న షార్క్‌కు స్థానికులు ‘బుకాంగి’ అని నామకరణం చేసారు. షార్క్‌ను సముద్రంలోకి పంపేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో స్థానిక మీడియా నిరంతరం దీనిపై వార్తలు ప్రసారం చేసింది. దీంతో ‘బుకాంగి’ సోషల్ మీడియాలో కూడా వైరల్‌గా మారింది.

షార్క్ ను చూసేందుకు 10 లక్షల మంది

అనుకోకుండా కాలువలో చిక్కుకున్న ఓ షార్క్.. ఇప్పుడు బుసాన్ నగరానికి పర్యాటక ఆకర్షణగా మారింది. లక్షలాది మంది సందర్శకులు రావడంతో స్థానిక దుకాణాలు, వ్యాపారాలకు ఆదాయం పెరిగింది. అయితే షార్క్ ఎప్పుడు సముద్రంలోకి వెళ్లిపోతుందో తెలియకపోవడంతో పెద్ద కంపెనీలు ఈ క్రేజ్‌ ఎంతో కాలం ఉండదని భావిస్తున్నాయి. ‘ప్రజలు బుకాంగిని ఇష్టపడటానికి కారణం.. షార్క్ తిరిగి సముద్రంలోకి వెళ్లిన తర్వాత ఈ అసాధారణ ఘటన కేవలం ఓ జ్ఞాపకంగా మిగిలిపోతుంది అని భావించడమే’ అని మార్కెటింగ్ నిపుణుడు యున్ జిన్-హో అన్నారు.

సముద్రంలోకి పంపేందుకు విఫలయత్నం

షార్క్‌ను తిరిగి సముద్రంలోకి పంపేందుకు అధికారులు రెండు సార్లు ప్రయత్నించారు. అధిక ఒత్తిడితో నీటిని కొట్టడం, పెద్ద శబ్దాలు చేయడం చేసారు. పెద్ద వలతో షార్క్‌ను కాలువ బయటకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే మరుసటి రోజే అది మరింత లోపలికి ఈదుకుంటూ వచ్చింది. దీంతో ఆ ప్రయత్నం విఫలమైంది.

18 రోజులుగా ఆహారం తీసుకోలేదా?

షార్క్ ఆరోగ్యాన్ని ఫిషరీస్ సైన్స్ శాస్త్రవేత్తలు పర్యవేక్షిస్తున్నారు. నీటి ఉష్ణోగ్రత తగ్గితే దానంతట అదే సముద్రంలోకి వెళ్లే అవకాశం ఉందని, అది ఎక్కువ కాలం అక్కడే ఉంటే బలహీనపడే ప్రమాదం ఉందని అంటున్నారు. ‘షార్క్ ఆహారం తీసుకుని దాదాపు 18 రోజులు అవుతోంది’ అని ప్రొఫెసర్ ఎమెరిటస్ చోయ్ యూన్ తెలిపారు.

Trapped Shark In South Korea Canal Attracts Crowds

సముద్రపు  కేబుల్స్ కారణమా?

షార్క్ ఆ ప్రాంతంలోనే చిక్కుకుపోవడానికి ఓ ఆసక్తికరమైన కారణాన్ని నిపుణులు చెబుతున్నారు. కాలువలో సముద్రం అడుగున ఉన్న కేబుల్స్ వల్ల ఏర్పడే అయస్కాంత క్షేత్రం షార్క్‌ను ఆకర్షించి ఉండొచ్చని చోయ్ యూన్ అభిప్రాయపడ్డారు. షార్క్‌లు సముద్రంలో దిశను గుర్తించేందుకు, ప్రయాణించేందుకు భూమి అయస్కాంత క్షేత్రాలను ఉపయోగిస్తాయి.

‘బుకాంగి’ పేరుపై ట్రేడ్‌మార్క్ వివాదం

షార్క్‌కు వచ్చిన క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని కొందరు వ్యాపారులు ‘బుకాంగి’ పేరును వాణిజ్య ప్రయోజనాల కోసం వాడుతున్నట్లు  అధికారులు గుర్తించారు. ఆ పేరును ప్రైవేటు వ్యక్తులు ట్రేడ్‌మార్క్ చేసుకోవడాన్ని అడ్డుకుంటామని బుసాన్ నగర అధికారులు హెచ్చరించారు. ‘బుకాంగి ఇప్పుడు బుసాన్‌కు కొత్త గుర్తింపుగా మారింది. ప్రజలు సృష్టించిన ఈ పేరును వ్యాపారాల కోసం వాడుకునేందుకు అనుమతించం’ అని బుసాన్ మేయర్ చున్ జే సూ స్పష్టం చేసారు

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us