
భూమి పెరగడం ఎప్పుడైనా చూశారా ? ఇప్పటివరకు పురాతన నగరాలు సముద్రంలోకి మునిగిపోయాయి.. కృష్ణుడు నడయాడిన నేల సైతం సముద్ర గర్భాణా ఉందనే మాటలు విన్నాం కదా.. అలాగే ప్రస్తుతం కాలంలో భూమి కుంగి పోవడం వంటి సంఘటనలు అనేకం జరుగుతున్నాయి. ఉన్నట్టుండి భూమి కుంగిపోవడం.. పెద్దగా గుంత పడడం వంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అయితే భూమి అంతకు అంత పెరిగిపోవడం ఇప్పుడు చాలా వరకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ ఘటన మరే దేశంలో జరగలేదు. మన ఇండియాలోని హర్యానా రాష్ట్రంలో భూమి అందరూ చూస్తుండగానే పెరుగుతూ.. ఉబ్బినట్లుగా మారిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతుంది.
ఆ వీడియో.. ఓ కాలువలో అడుగున ఉన్న ప్రాంతం ఒక్కసారిగా పెరిగిపోవడం ప్రారంభించింది. ఏదో కాస్త పెరిగి ఆగిపోలేదు. దాదాపు మనిషి ఎత్తును మించి భూమి పెరిగిపోయింది. దీంతో అక్కడే ఉన్నవారు షాక్‌కు గురయ్యారు. వెంటనే ఈ షాకింగ్ దృశ్యాన్ని తమ ఫోన్లలో బంధించి.. ఇంటర్నెట్లో షేర్ చేయగా.. ఆ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. అయితే భూమి పెరగడానికి గల కారణాలు స్పష్టంగా తెలియరాలేదు. టెక్టోనిక్ కార్యకలాపాల వల్ల భూమి పెరిగిందని కొందరు అంటుండగా.. మరికొందరు భూమిలో ఉన్న మిథేన్ వలన ఇలా జరిగిందని వాదిస్తున్నారు. మీరు ఆ వీడియోను ఒకసారి చూసేయ్యండి.
వీడియో..
Sonam Kapoor: ప్రెగ్నెన్సీ రూమర్స్‌కు అలా ఫుల్స్టాప్ పెట్టిన టాప్ హీరోయిన్.. అసలు విషయం ఇదే అంటూ..