నీటిలో పుట్టి.. నీటిలో పెరిగి.. నీళ్లు తగిలితే చనిపోయేది ఏది..? 99శాతం మంది ఫెయిల్

నీటిలో పుట్టి, నీటిలోనే పెరిగి.. చివరకు నీటి బొట్టు తగలగానే ప్రాణాలు కోల్పోయే వింత జీవి లేదా పదార్థం ఏమై ఉంటుందో ఎప్పుడైనా ఊహించారా? ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్ల బుర్రలకు పదును పెడుతూ తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఈ వింత పొడుపు కథకు చాలామంది సమాధానం చెప్పలేక చేతులెత్తేస్తున్నారు. చదవడానికి ఎంతో సులువుగా అనిపించినా, మెదడుకు మేత పెడుతున్న ఈ పజిల్ వెనుక ఉన్న అసలైన సమాధానం గురించి తెలుసుకుందాం..

నీటిలో పుట్టి.. నీటిలో పెరిగి.. నీళ్లు తగిలితే చనిపోయేది ఏది..? 99శాతం మంది ఫెయిల్
Viral Brain Teaser 1

Updated on: Oct 29, 2026 | 7:18 PM

సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో రకాల పజిల్స్, ఆప్టికల్ ఇల్యూషన్లు, పొడుపు కథలు వైరల్ అవుతుంటాయి. కొన్ని తేలికగా అనిపించినా.. సమాధానం కనిపెట్టే సరికి మాత్రం తల ప్రాణం తోకకు వస్తుంది. తాజాగా అలాంటి ఒక ఆసక్తికరమైన పొడుపు కథ నెటిజన్ల బుర్రకు పదును పెడుతోంది. చదవడానికి చాలా సింపుల్‌గా ఉన్నా, సరైన సమాధానం చెప్పలేక చాలామంది తలలు పట్టుకుంటున్నారు. ఆ పొడుకు కథ ఏంటంటే..? “నేను నీటిలోనే పుడతాను, నీటిలోనే పెరుగుతాను.. కానీ నా ఒంటికి నీరు తగిలితే మాత్రం నేను చచ్చిపోతాను..! ఇంతకీ నేను ఎవరిని?”.. చదవడానికి రెండు లైన్లలో ఎంతో సింపుల్‌గా కనిపిస్తున్న ఈ ప్రశ్న, కామెంట్ సెక్షన్‌లో మాత్రం పెద్ద చర్చకే తెరలేపింది. సాధారణంగా ఏ ప్రాణికైనా, జీవికైనా లేదా వస్తువుకైనా పుట్టిన చోటే రక్షణ లభిస్తుంది. నీటిలో పుట్టి పెరిగే జీవులకు నీరే ప్రాణాధారం. కానీ నీరు తగిలితే ప్రాణాలు పోయే ఈ వింత జీవి లేదా పదార్థం ఏమై ఉంటుందా అని నెటిజన్లు తీవ్రంగా ఆలోచిస్తున్నారు.

రకరకాల పేర్లు.. చర్చలు..

చాలామంది మొదటి చూపులోనే చేప అని కామెంట్ చేయగా.. మరికొందరు చేప నీటిలో చనిపోదు కదా, బయటకు తీస్తేనే చస్తుంది అంటూ వారి వాదనను కొట్టిపారేశారు. ఇంకొందరు మంచు గడ్డ కావచ్చని భావించారు. కానీ మంచు నీటిలో పుట్టదు, నీటిని గడ్డకట్టించడం ద్వారా ఏర్పడుతుంది. మరికొందరు కప్పలు, కీటకాలు లేదా ఏదైనా జలచరం అయి ఉంటుందని ఊహించారు. ఇలా ఎవరికి తోచిన విధంగా వారు కామెంట్లు చేస్తుండటంతో ఈ పజిల్ మరింత వైరల్‌గా మారింది. అయితే సరైన లాజిక్ ఆలోచించిన అతి కొద్దిమంది మాత్రమే కచ్చితమైన సమాధానాన్ని చెప్పగలిగారు

అసలైన సమాధానం ఇదే

ఈ పొడుపు కథకు సరైన సమాధానం..ఉప్పు. అవును సముద్రపు నీటి ద్వారానే ఉప్పు తయారవుతుంది. అంటే నీటి నుంచే దాని పుట్టుక, ఎదుగుదల జరుగుతాయి. అయితే పూర్తిగా ఎండిన తర్వాత తయారైన ఉప్పుపై మళ్లీ నీటి చుక్క పడితే చాలు.. అది తక్షణమే కరిగిపోయి తన ఉనికిని కోల్పోతుంది. అందుకేనీరు తగిలితే చచ్చిపోతుంది అని వర్ణించారు. మరి ఈ ప్రశ్న చూడగానే మీ మైండ్‌లోకి ఏ సమాధానం వచ్చింది? మీరు దీన్ని మొదటి ప్రయత్నంలోనే కనిపెట్టారా లేదా? మీ స్నేహితులకు కూడా షేర్ చేసి వాళ్ల తెలివితేటలను పరీక్షించండి..

Loading...
Unable to load recommendations.
Follow Us