Viral Video: రౌండప్ చేసి పాముకు సుస్సు పోయించిన పక్షులు.. వీడియో చూస్తే మీరు పక్కా స్టన్ అవుతారు

పాము తిరగబడేందుకు ప్రయత్నించగా... పక్షులు దాడిని తీవ్రం చేశాయి. క్షణం కూడా గ్యాప్ ఇవ్వకుండా... ఒకటి తర్వాత ఒకటి..రఫ్పాడించాయి. ఈ వీడియో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.

Viral Video: రౌండప్ చేసి పాముకు సుస్సు పోయించిన పక్షులు.. వీడియో చూస్తే మీరు పక్కా స్టన్ అవుతారు
Snake Vs Birds

Updated on: May 28, 2022 | 4:58 PM

birds gang attack on snake: పాములు ఎంత డేంజరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక్క కాటుతో అవి ప్రాణాలు తీసేస్తాయి. ముఖ్యంగా పక్షులు గూళ్లలో పెట్టే గుడ్లను.. చిన్న, చిన్న పిల్లలను అమాంతం మింగేస్తాయి. పాముకు సరైన కౌంటర్ ఇచ్చేది.. ముంగిసే. పెద్ద.. పెద్ద జంతువులు కూడా విషపూరితమైనదని అని భావించి దాని జోలికి వెళ్లకు. అయితే కొన్ని పక్షులు మాత్రం పాముకు సుస్సు పోయించాయి. రౌండప్ చేసి… కాళ్లతో తంతూ కబడ్డీ ఆడుకున్నాయి. కొద్ది సేపు కూడా గ్యాప్ ఇవ్వకుండా.. అల్లాడించాయి. ఆ పాము ఏమి హాని తలపెట్టిందో.. ఏమో తెలియదు కానీ.. పక్షులు మాత్రం చాలా కోపంగా కనిపించాయి. పాము పడగ విప్పి కాటేసేందుకు ప్రయత్నిస్తున్నా.. ఆగకుండా కాళ్లతో తంతూ.. దాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. రౌండప్ చేసి కన్‌ఫ్యూజ్ చేసి.. రఫ్పాడించాయి. పాము తల ఎటు ఉందో చూసుకొని… ఆ తలకు వెనక ఉండే పక్షి దాడి చేస్తోంది. ఇలా పాము తల దిశ మారిన ప్రతిసారీ… ఆ వెనక ఉండే పక్షి అటాక్ చేస్తోంది. ఈ వీడియో చూసి నెటిజన్లు స్టన్ అవుతున్నారు. పక్షులు శత్రువుపై ఈ రకంగా ఉమ్మడిగా దాడి చేయడం ఆశ్చర్యంగా అనిపించిందని కొందరు కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. వీడియో చివర్లో గమనిస్తే.. ఆ పాము సొమ్మసిల్లి పడిపోవడం చూడొచ్చు. అది చనిపోయిందని కూడా కొందరు అంటున్నారు. చూశారుగా యూనిటీగా ఉంటే.. ఎంత పెద్ద శత్రవునైనా ఓడించవచ్చు.. ఎదిరించవచ్చు. అందుకే పెద్దలు అంటారు.. ఐకమత్యమే మహాబలం అని.

వీడియో దిగువన చూడండి 

 

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us