ఈ రోజుల్లో లవర్ కోసం యువతీయువకులు చేసే ప్రయత్నాలు అన్నీఇన్నీ కావు. ఇలా ప్రయత్నాలు చేస్తున్నవారికి ఎవరైనా స్వయంగా వచ్చి ‘హాయ్’ చెప్పినా, ఫోన్ నంబర్ ఇచ్చినా ఇక అదృష్టమే. అంతేనా కోతికి కొబ్బరి చిప్ప దొరికిందే తీరు అన్నట్లుగా తెగ మురిసిపోతుంటారు. ఇక ఇలా అమ్మాయిల కోసం అబ్బాయిలు, అబ్బాయిల కోసం అమ్మాయిలు పడే పాట్ల గురించి అనేక వీడియోలు సోషల్ మీడిమాలో కూడా అనేకం వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా అందుకు భిన్నమైన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఇక ఆ వీడియోలోని యువకుడు చేసిన పనికి నెటిజన్లు తల బాదుకుంటున్నారు. ‘స్వయంగా అమ్మాయి నంబర్ ఇస్తే ఇలా చేశాడేంటి..?’ అన్నట్లుగా కామెంట్లు పెడుతున్నారు.
అసలు ఆ వీడియోలో ఏముందంటే.. ఓ యువతి తన తండ్రితో కలిసి స్కూటీపై కాలేజీకి వెళ్తుంది. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ యువకుడిని చూసి, హాయ్ చెప్పి తన నంబర్ రాసి అతనికిి ఇస్తుంది. అయితే అతను ఆ నంబర్ తీసుకుని, వెంటనే ఆ యువతి తండ్రి బండి ఆపుతాడు. తర్వాత జరిగిన విషయం అయనకు వివరిస్తాడు. దీంతో ఆ తండ్రి తన కూతురుని కొడతాడు. ఇలా సాగిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ఇక ఈ వైరల్ వీడియోకి ఇప్పటివరకు లక్షా 25 వేల లైకులు, 24 లక్షలకు పైగా వీక్షణలు వచ్చాయి. ఇంకా అనేక మంది నెటిజన్లు వీడియోపై స్పందించి కామెంట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు ‘అయ్యిందా.. బాగా అయ్యిందా..?’ అని, మరికొందరు ‘పాపం అమాయకురాలు.., మూర్ఖుడికి నంబర్ ఇచ్చింద’ని రాసుకొస్తున్నారు. ఇంకొందరు అయితే ఫన్నీ ఎమోజీలతో కామెంట్ చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.