Viral: 13 ఏళ్ల బాలుడితో 31 ఏళ్ల మహిళ శారీరక సంబంధం.. ఆపై గర్భం.. షాకింగ్ తీర్పు ఇచ్చిన కోర్టు

|

Mar 08, 2023 | 3:10 PM

బయటివారంతా వీరిద్దరూ తల్లీకుమారులు అని భావించారు. అంతా సవ్యంగా జరుగుతోందని అనుకుంటుండగానే.. ఆండ్రియా గర్భం దాల్చింది. ఇక అంతా షాక్.

Viral: 13 ఏళ్ల బాలుడితో 31 ఏళ్ల మహిళ శారీరక సంబంధం.. ఆపై గర్భం.. షాకింగ్ తీర్పు ఇచ్చిన కోర్టు
Andrea Serrano
Follow us on

పక్కింటి బాలుడిపై ఆమెకు ఇష్టం పెరిగింది. అతడితో స్లోగా మాటలు కలిపి.. మాయ చేసింది. ఇంటి పనుల్లో సాయం అంటూ.. రమ్మనేది. అలా స్లోగా అతడిని ట్రాప్ చేసి.. లైంగిక సంబంధం ఏర్పరుచుకుంది. వారికి తల్లీకుమారుల వయస్సు ఉండటంతో ఎవ్వరూ తప్పుగా ఆలోచించలేదు. ఆ మహిళ తాజాగా ప్రెగ్నెంట్ అవ్వడంతో.. అంతా రివీలయ్యింది. అమెరికాలో జరిగిందీ ఘటన.

కొలరాడో రాష్ట్రంలో ఉండే ఆండ్రియా సెరానో (31) అనే మహిళకు తన ఇంటి పక్కన ఉండే 13 ఏళ్ల అబ్బాయి వలన గర్భవతి అయ్యింది. అతడిపై వ్యామోహంతో ఆమే  లైంగిక సంబంధానికి పురిగొల్పినట్లు పోలీసులు ధృవీకరించారు. విషయం బయటకు చెప్పొద్దని బాలుడిని కోరింది ఆండ్రియా. అలా కొన్నాళ్లు వీరి వ్యవహారం నడిచింది. ఆండ్రియా గర్భం దాల్చడంతో..  బాలుడితో ఆమె లైంగిక సంబంధం బయటపడింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. కొడుకు వయస్సు ఉండే చిన్నోడితో అఫైర్ పెట్టుకున్న ఆమెను అందరూ తిట్టిపోశారు.

కేసు కోర్టుకు వెళ్లింది. ఆమె అక్కడ నిజం కక్కేసింది. కడుపులో పెరుగుతున్న బిడ్డకు.. ఆ బాలుడే తండ్రి అని న్యాయమూర్తికి చెప్పేసింది. అదే సమయంలో బాలుడితో ఆండ్రియా రాజీ కుదుర్చుకుంది. అతడు ఆమెపై ఎలాంటి ఆరోపణలు చేయలేదు. దీంతో జడ్జీలకు కేసును ఎలా తేల్చాలో అర్థం కాలేదు. మహిళ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఆమెను రిలీజ్ చేయడానికి అంగీకరించారు. 70వేల డాలర్ల (రూ.57లక్షలు) పూచీకత్తుతో ఆమెను విడుదల చేశారు. పుట్టబోయే బిడ్డకు 13ఏళ్ల బాలుడే తండ్రిగా పరిగణించాలని ధర్మాసనం స్పష్టం చేసింది.

బాలుడి ఫ్యామిలీ మాత్రం.. ఆండ్రియాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘అమ్మ’ అని పిలిచే బాలుడితో లైంగిక సంబంధం ఎలా పెట్టుకోవాలని అనిపించిందని ఆండ్రియాపై నిప్పులు చెరుగుతున్నారు. ఆమె తన కుమారుడి జీవితాన్ని పాడు చేసిందని బాలుడి తల్లి ఆగ్రహం వ్యక్తం చేసింది. అంత తక్కువ వయస్సులో తండ్రి అవ్వడం ఏంటి? ఇకపై వాడు తండ్రిలా బతకాలి. ఒకవేళ ఆండ్రియా నా బిడ్డ స్థానంలో ఉండి ఉంటే.. అప్పుడు కూడా ఇలాంటి న్యాయమే చేసేవారా?’ అని బాలుడి తల్లి కోర్టును ప్రశ్నిస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..