Viral Video: చూస్తుండగానే ఢీకొన్న ఫైటర్ జెట్స్‌.. గాల్లోనే ముక్కలు ముక్కలు.. ఇదిగో వీడియో

US Navy fighter jets collision: ఈ మధ్య కాలంలో విమాన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా రక్షణ దళాలు నిర్వహించిన ఓ ఎయిర్‌ షోలో రెండు ఫైటర్ ఒకదానికి ఒకటి ఢీకొని గాల్లోనే ముక్కలు ముక్కలు అయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Viral Video: చూస్తుండగానే ఢీకొన్న ఫైటర్ జెట్స్‌.. గాల్లోనే ముక్కలు ముక్కలు.. ఇదిగో వీడియో
,us Navy Fighter Jets Collision

Updated on: May 18, 2026 | 11:44 AM

చూస్తుండగానే రెండు ఫైటర్ జెట్‌లు ఒకదానికి ఒకటి ఢీకొట్టి ముక్కలు ముక్కలైన ఘటన అమెరికాలోని వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. ఇడాహోలో ఉన్న మౌంటైన్ హోమ్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో ఇటీవల గన్‌ఫైటర్ స్కైస్ ఎయిర్ షో నిర్వహించారు. ఇక రెండో రోజు షోలో భాగంగా పాల్గొన్న యూఎస్ నేవీకి చెందిన F/A-18E/F సూపర్ హార్నెట్, అలాగే బోయింగ్ EA-18G గ్రోవ్లర్ అనే రెండు ఫైటర్ జెట్లు ప్రమాదవశాత్తు గాల్లోనే ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

వైరల్ వీడియో ప్రకారం.. ఎయిర్‌ షో జరుగుతుండా రెండు ఫైటర్ జెట్‌లు ఒకదానికొకటి చాలా దగ్గరగా ఎగురుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ ఫైటర్ అదుపుతప్పి పక్కనున్న మరో పైటర్ జెట్‌ను ఢీకొట్టింది. అంతే రెండు జెట్‌లు ముక్కలు ముక్కలుగా విరిగిపోయి వేగంగా భూమిపైకి దూసుకొచ్చి రన్‌వేపై కుప్పకూలాయి. దీంతో ఒక్కసారిగా భారీ శబ్ధంతో పాటు మంటలు చెలరేగాయి. అయితే అదృష్టవశాత్తు విమానాలు గాళ్లలో ఉండగానే అందులో ఉన్న పైటల్స్‌ ప్యారాషూట్‌ల సహాయంతో తప్పించుకున్నారు. సేఫ్‌గా నేలపై ల్యాండ్ అయినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

ఇక రెండు విమానాలు రన్‌వైపై పడిన వెంటనే భారీగా మంటలు చెలరేగడం, దట్టమైన పొగ కమ్మేసాయి. దీంతో అలర్ట్‌ అయిన ఏవియేషన్ వర్గాల వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేసిన రన్‌వేను క్లీన్ చేశారు. ఇక ప్రమాదం కారణంగా ఆదివారం మధ్యాహ్నం సుమారు 1:20 గంటలకు, మౌంటైన్ హోమ్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ఈ ఎయిర్‌ ఫో కార్యక్రమాన్ని అధికారికంగా రద్దు చేసినట్లు ప్రకటించింది.

వీడియో చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us