Watch Video: గజరాజుల భీకరపోరుకి వణికిపోయిన అడవి, వైరలవుతున్న వీడియో

సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు ట్రెండిగ్ అవతుంటాయి. కొంచెం వింతగా, ఆసక్తికరంగా కనిపిస్తే చాలు.. వేలు, లక్షల్లో వ్యూస్ వచ్చేస్తాయి. ఈ మధ్య మనుషులవే కాదు.. జంతువుల వీడియోలు కూడా నెట్టింట వైరల్ అయిపోతున్నాయి. జంతువులు ఏదైన కాస్త భిన్నంగా చేయడం కనిపించినా కూడా ఆ వీడియోలు ట్రెండింగ్‌లోకి వెళ్లిపోతాయి.

Watch Video: గజరాజుల భీకరపోరుకి వణికిపోయిన అడవి, వైరలవుతున్న వీడియో
Elephants

Updated on: May 17, 2023 | 2:16 PM

సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు ట్రెండిగ్ అవతుంటాయి. కొంచెం వింతగా, ఆసక్తికరంగా కనిపిస్తే చాలు.. వేలు, లక్షల్లో వ్యూస్ వచ్చేస్తాయి. ఈ మధ్య మనుషులవే కాదు.. జంతువుల వీడియోలు కూడా నెట్టింట వైరల్ అయిపోతున్నాయి. జంతువులు ఏదైన కాస్త భిన్నంగా చేయడం కనిపించినా కూడా ఆ వీడియోలు ట్రెండింగ్‌లోకి వెళ్లిపోతాయి. అయితే తాజాగా రెండు ఎనుగులు పోట్లాడుకున్న వీడియో కూడా ప్రస్తుతం హల్‌చల్ చేస్తోంది.

నడిరోడ్డుపైన రెండు ఏనుగులు భీకరపోరుకు తెరలేపాయి. ఒకదానికొకటి వాటి తొండాలతో తోసుకున్నాయి. నువ్వా నేనా అనే రీతిలో పోట్లాడుకున్నాయి. ఈ వీడియోను ఐఎఫ్‌ఎస్ అధికారి సుశాంత నందా ట్విట్టర్‌లో షేర్ చేశారు. రెండు గజరాజులు పోట్లాడుకున్నప్పుడు అడవి వణికిపోతుందంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అడ‌విపై ఏనుగులు త‌మ ఆధిక్యతను క‌న‌బ‌రిచేందుకు కూడా ఇది ఓ సంకేత‌మ‌ని ఓ యూజ‌ర్ కామెంట్ చేశారు. ఏనుగుల ఫైట్‌ను వీడియో తీసిన వ్యక్తి ధైర్యానికి మెచ్చుకోవ‌చ్చవంటూ మ‌రో యూజ‌ర్ అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us