ఫన్.. ఫన్.. ఫన్.. జస్ట్ ఒక్క క్లిక్‌తో ఇంటర్నెట్లో కావల్సినంత దొరుకుతుంది. వీడియోలు, ఫోటోలు, మీమ్స్.. ఇలా ఎన్నో ఉన్నాయి. అదే ఫన్‌తో పాటు మెదడుకు కూడా కాస్త పని చెప్పాలంటే.. ఫోటో పజిల్స్, ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలే కరెక్ట్ ఆప్షన్. ఇవి మనసుకు ప్రశాంతత ఇవ్వడంతో పాటు కళ్లకు, మెదడుకు పని చెబుతుంటాయి. ఇలాంటి చిత్రాలు మనకు తరచూ సవాళ్లు విసురుతుంటాయి. పూర్వం మనం బోరు కొట్టినప్పుడల్లా సాల్వ్ చేసే సుడోకోలు, ‘ఫైండ్ ది డిఫరెన్స్’ ఫోటోలు ఒక ఎత్తయితే.. ఈ ఫోటో పజిల్స్ మరో ఎత్తు. ఇవి మేధావులను సైతం ముప్పుతిప్పలు పెడుతుంటాయి. వాటిల్లో ఉండే సమాధానం పైకి కనిపించినప్పటికీ.. మన కళ్లకు మనల్ని మోసం చేస్తుంటాయి. వీటికంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రత్యేక పేజీలు ఉన్నాయి. అలాంటి కోవకు చెందిన ఓ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది.
ఒక ప్రక్క శిఖరం .. మరోపక్క ఎండిన చెట్టు.. ఫోటోలో కనిపిస్తున్న ఈ ప్రాంతంలో గద్ద ఎంచక్కా సేద తీరుతోంది. అది ఎక్కడుందో మీరు కనిపెట్టాలి. ఈ చిత్రంలో దాగున్న గద్దను ఇరవై సెకన్లలో కనుగొన్నట్లయితే, మీ కళ్లలో పదునున్నట్లే.. ఒకవేళ మీరు గద్దను కనిపెట్టలేకపోతే.. అస్సలు నిరుత్సాహపడకండి.. ఎందుకంటే ఈ పజిల్‌ను సాల్వ్ చేయడంలో నూటికి 90 శాతం మంది ఫెయిల్ అయ్యారు. లేట్ ఎందుకు ఓసారి పజిల్‌పై లుక్కేయండి.. సాల్వ్ చేసేందుకు ప్రయత్నించండి.
here is the answer pic.twitter.com/zfwQNeUVno
— telugufunworld (@telugufunworld) June 27, 2022