హీరో-హీరోయిన్‌లు తమ ప్రేమను వ్యక్తం చేసుకోవడం అనేక సినిమాల్లో చూసి ఉంటారు. అందులో వారు తమ ప్రియుడు, ప్రియురాలికి పువ్వులు లేదా ఖరీదైన బహుమతిని ఇచ్చి ప్రపోజ్ చేస్తారు. సాధారణంగా ఈ పద్ధతులు ఎక్కువగా ప్రేమను వ్యక్తీకరించడానికి అనుసరిస్తుంటారు. కానీ, ఇప్పుడు ట్రెండ్ మారింది. ఆధునిక కాలంలో ప్రేమ ప్రొజల్ నిర్వచనం కూడా మారిపోయింది. ఇలాంటి చిత్రవిచిత్ర ప్రేమ కథలకు సంబంధించిన అనేక వార్తలు, వీడియోలు మనం సోషల్ మీడియాలో చాలానే చూశాం. ఇందులో ప్రేమికులు తమ ప్రేమను వ్యక్తీకరించడానికి వింత వింతలు ప్రయత్నాలు చేస్తుంటారు. ఇప్పుడు కూడా అలాంటి వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇందులో ఓ అమ్మాయి తన ప్రియుడి చేతిని కొరికి, ఆ పంటి ఘాటు గుర్తులనే టాటూ వేయించుకున్నాడు. ఈ వీడియో చూసిన వినియోగదారులు మిశ్రమ కామెంట్లను ఇస్తూ తమ అభిప్రాయాన్ని కూడా తెలియజేస్తున్నారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో స్కైటాటు అనే పేజీలో అప్‌లోడ్ చేయబడిన ఈ వీడియోలో, ఒక అమ్మాయి మొదట తన ప్రియుడి చేతిని తన పళ్ళతో గట్టిగా అచ్చు పడేలా కొరికింది. ఆమె పంటి ఆనవాళ్లు చేతిపై మచ్చగా పడ్డాయి. ఆ గుర్తులను పచ్చబొట్టుగా వేయించాడు. ప్రియురాలి ప్రేమ కాటుపై ప్రియుడు తన చేతిపై టాటూ వేయించుకున్నాడు. అంతే కాదు ఆ అమ్మాయి ప్రియుడు తన గర్ల్ ఫ్రెండ్ పేరు, టాటూ వేయించుకున్న తేదీని కూడా రాసుకున్నాడు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోను కోటి మందికి పైగా వీక్షించారు.
అయితే, ఈ వీడియో చూసిన తర్వాత, వినియోగదారులు భిన్నమైన కామెంట్లు చేశారు. ఓహ్ గాడ్.. ఇలాంటి మనుషులు ఎక్కడ్నుంచి వచ్చార్రా బాబు అంటూ ఒకరు స్పందించగా, మరొక వినియోగదారు స్పందిస్తూ.. ఇది చాలు.. ఇక నేను నా ఇన్‌స్టాగ్రామ్‌ను రిమూవ్ చేయాలనుకుంటున్నాను.. అని చెప్పాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో కోటి మందికి పైగా ఈ వీడియోను చూడగా, ఐదు లక్షల మందికి పైగా వినియోగదారులు ఈ వీడియోను లైక్ చేశారు. దీనితో పాటు, ఈ పేజీలో చాలా వీడియోలు అప్‌లోడ్ చేయబడ్డాయి, వీటిని చూస్తే ఇదేం ప్రేమరా బాబు అని మీరు షాక్ అవుతారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..