Viral News: తప్పతాగి చోరీ చేసిన చోటే నిద్రపోయిన దొంగ..ఉదయం కళ్లు తెరిచి చూసే సరికి ఏమైందంటే..!

|

Dec 10, 2024 | 10:01 AM

అరడజను చోట్ల దొంగతనం చేసి అక్కడే పడుకున్నాడు. ఉదయం వరకు కళ్లు తెరవలేదు.. కానీ, తెల్లవారి నిద్ర లేచే సరికి అతనికి అంతా తలకిందులుగా కనిపించింది. పొలాల్లో కేబుల్స్‌ దొంగిలించేందుకు వచ్చిన ఓ దొంగను చెట్టుకు తలకిందులుగా వేలాడదీసిన షాకింగ్ ఘటన ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారింది. రాత్రి కేబుల్స్ దొంగిలించిన ఒక వ్యక్తి ఊరి చివర పొలంలో ఉన్న ఒక గుడిసెలో తప్పతాగి నిద్రపోయాడు..ఉదయం వరకు కళ్లు తెరవలేదు. ఉదయం లేచిన వెంటనే చెట్టుకు తలకిందులుగా వేలాడుతూ కనిపించాడు. ఆ తరువాత ఏం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళితే..

Viral News: తప్పతాగి చోరీ చేసిన చోటే నిద్రపోయిన దొంగ..ఉదయం కళ్లు తెరిచి చూసే సరికి ఏమైందంటే..!
Thief Falls Asleep
Follow us on

అరడజను చోట్ల దొంగతనం చేసి అక్కడే పడుకున్నాడు. ఉదయం వరకు కళ్లు తెరవలేదు.. కానీ, తెల్లవారి నిద్ర లేచే సరికి అతనికి అంతా తలకిందులుగా కనిపించింది. పొలాల్లో కేబుల్స్‌ దొంగిలించేందుకు వచ్చిన ఓ దొంగను చెట్టుకు తలకిందులుగా వేలాడదీసిన షాకింగ్ ఘటన ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారింది. రాత్రి కేబుల్స్ దొంగిలించిన ఒక వ్యక్తి ఊరి చివర పొలంలో ఉన్న ఒక గుడిసెలో తప్పతాగి నిద్రపోయాడు..ఉదయం వరకు కళ్లు తెరవలేదు. ఉదయం లేచిన వెంటనే చెట్టుకు తలకిందులుగా వేలాడుతూ కనిపించాడు. ఆ తరువాత ఏం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళితే..

రాజస్థాన్‌లోని బుండి గ్రామంలో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్‌నెట్‌లో వైరల్ అవుతోంది. బుండి గ్రామానికి చెందని హన్సరాజ్‌ అనే వ్యక్తి ఊరు శివార్లలోని పొల్లాల్లోకి వెళ్లి కరెంటు వైర్లు దొంగిలించాడు. చోరీ అనంతరం వైర్లు అన్నింటిని బ్యాగులో సర్దుకున్నాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న ఆ దొంగ ఆ తర్వాత కూడా తన వెంట తెచ్చుకున్న మద్యాన్ని సేవించాడు. ఫూటుగా తాగాక, మత్తు నశాలానికి ఎక్కింది.. మత్తుగా నిద్రముంచుకొచ్చింది. ఇంకేం అక్కడే ఓ పొలం గట్టున ఉన్న గుడిసెలో హాయిగా పడకేశాడు. మద్యం మత్తులో జోగుతున్న అతడిని తెల్లవారినా మెళుకువ రాలేదు. తీరా తెల్లవారాకా అతడి పరిస్థితి ఏంటో అర్థం కాలేదు మనోడికి.

ఇవి కూడా చదవండి

తీరా తెల్లవారింది. ఇంతలోనే పొలం పనుల కోసం వచ్చిన రైతులు, కూలీలు గుడిసెలో నిద్రపోతున్న దొంగను గమనించారు. దొంగతనం చేసి అక్కడే నిద్రపోతున్న అతడిని పట్టుకుని అక్కడే చితక్కొట్టారు. ఆ తర్వాత ఊర్లోకి తీసుకొచ్చి, ఊరి నడుమ ఉన్న పెద్ద చెట్టుకు వేలాడ దీశారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దొంగను స్టేషన్‌కు తీసుకెళ్లారు. కాగా, ఇదంతా వీడియో తీసిన కొందరు స్థానికులు సోషల్ మీడియాలో పోస్ట్‌ చేయటంతో ఇది కాస్త వైరల్‌ అవుతోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..