‘ఈ ఫోటోలో చిరుతను కనిపెట్టండి’.. ‘ఇందులో ఓ జంతువు దాగుంది.. అదెక్కడుందో గుర్తించండి’ అంటూ ఈ మధ్యకాలంలో ఇలాంటి ఆర్టికల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొదటిగా టైటిల్ ఆసక్తిని పెంచే ఈ ఫోటో పజిల్స్.. మన మెదడుకు మేత వేయడమే కాకుండా.. కళ్లను పదును పెడతాయి. తాజాగా అలాంటి కోవకు చెందిన ఓ ఫోటో గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం..
ఈ మధ్య ఇంటర్నెట్ వాడకం ఎక్కువ కావడంతో ఏ చిన్న విషయం జరిగినా కూడా ఠక్కున సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. న్యూస్ దగ్గర నుంచి వైరల్ ఎలిమెంట్స్ వరకు అన్నింటినీ నెటిజన్లు ఇష్టపడుతున్నారు. ఆ కోవలోనే ఫోటో పజిల్స్పై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. కొన్నిసార్లు పాతవి కూడా మరోసారి లేటెస్ట్గా నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి.
పైన పేర్కొన్న ఫోటోలో ఓ చిరుత దాగుంది. అదెక్కడ ఉందో మీరు కనిపెట్టాలి. చూడటానికి కొండల ప్రాంతంలా ఉన్న ఆ ప్రదేశంలో నీలం రంగు గొర్రెను వేటాడేందుకు చిరుత ఓ చోట నక్కి ఉంది. తన ఎరను క్షణాల్లో మట్టుబెట్టడానికి సిద్దంగా ఉంది. మీరూ అదెక్కడ ఉందో గుర్తించండి. పజిల్ కొంచెం కష్టమే అయినా.. క్షణాల్లో సాల్వ్ చేయొచ్చు. మీ కళ్లు డేగ లాంటివి అయితే ఈజీగా కనిపెట్టొచ్చు. లెట్స్ ట్రై ఇట్.. అండ్ సాల్వ్ ఇట్.